అక్కినేని ఫాన్స్ కి భయపడిపోయాడు!

నాగార్జునకి మన్మధుడు 2 కెరీర్ లో కోలుకోలేని బిగ్గెస్ట్ డిజాస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుశాంత్ తో చి. ల. సౌ అంటూ ప్యూర్ లవ్ [more]

Update: 2021-03-22 13:02 GMT

నాగార్జునకి మన్మధుడు 2 కెరీర్ లో కోలుకోలేని బిగ్గెస్ట్ డిజాస్టర్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సుశాంత్ తో చి. ల. సౌ అంటూ ప్యూర్ లవ్ స్టోరీని తెరకెక్కించిన నటుడు రాహుల్ రవీంద్రన్ ఆ సినిమాతో బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అనిపించుకున్నాడు. ఆ సినిమా అటు లవ్ స్టోరీగా ఇటు ఎంటర్టైనింగ్ గా ఉండడంతో అన్నపూర్ణ స్టూడియోస్ లోనే రాహుల్ ని నాగార్జున మన్మధుడు కి సీక్వెల్ చెయ్యమని.. మన్మధుడు 2 చేయించాడు. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్ అవడంతో రాహుల్ రవీంద్ర ని దర్శకుడిగా భారీ గ్యాప్ వచ్చేసింది. మన్మధుడు 2 అప్పుడు నెక్స్ట్ కూడా నాగ్ తోనే మూవీ ఉండబోతుంది అని మాట్లాడిన వారు కామ్ అయ్యారు. రాహుల్ మూడో సినిమా ఇంతవరకు మొదలుపెట్టలేదు.
రీసెంట్ గా సోషల్ మీడియాలో చిట్ చాట్ చేసిన రాహుల్ కి ఓ అభిమాని మీ మూడో చిత్రం ఎప్పుడు మొదలు కాబోతుంది? మళ్ళీ నాగ్ తో సినిమా చేసే అవకాశం ఉందా? నాగ్ తో యాక్షన్ మూవీ చేయబోతున్నారట? అని అడగగా దానికి రాహుల్ వెంటనే నాగ్ తో సినిమానా? ఆయన అభిమానులు మన్మధుడు 2 విషయంలో ఇప్పటికి నన్ను తిడుతున్నారు. మళ్ళీ ఆయనతో సినిమా అంటే చంపేస్తారు. ఇప్పట్లో నాగ్ తో సినిమా అవ్వదు అంటూ తనని అక్కినేని అభిమానులు పెట్టిన టార్చర్ గురించి చెప్పకనే చెప్పేసాడు. ఫ్యూచర్ లో కుదిరితే, అన్నీ బావుంటే నాగ్ తో సినిమా ఉంటుంది అంటూ సెలవిచ్చాడు.

Tags:    

Similar News