సిక్స్ ప్యాక్ ఏజెంట్ అఖిల్

అఖిల్ నెక్స్ట్ ఏజెంట్ మూవీపై అందరిలో అంతకంతకు ఆసక్తి పెరిగిపోతుంది. మాస్ లుక్ రా ఏజెంట్ గా అఖిల్ ఏజెంట్ గా ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టేసాడు. [more]

Update: 2021-07-12 05:40 GMT

అఖిల్ నెక్స్ట్ ఏజెంట్ మూవీపై అందరిలో అంతకంతకు ఆసక్తి పెరిగిపోతుంది. మాస్ లుక్ రా ఏజెంట్ గా అఖిల్ ఏజెంట్ గా ఫస్ట్ లుక్ తోనే అదరగొట్టేసాడు. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ ఏజెంట్ మూవీ కోసం సూపర్ మేకోవర్ అయ్యాడు. హెయిర్ స్టయిల్, రఫ్ లుక్, సిగార్ తాగడం, బైక్ పైన అఖిల్ మాస్ లుక్ అన్ని అద్భుతంగా ఉన్నాయి.

ఇక ఏజెంట్ మూవీ షూటింగ్ మొదలు పెట్టుకోబోతుంది. నెల్లూరు కృష్ణపట్నం పోర్ట్ లో ఏజెంట్ మూవీ స్టార్టింగ్ షెడ్యూల్ మొదలు కాబోతుంది. అంతలోనే దర్శకుడు సురేందర్ రెడ్డి అఖిల్ సిక్స్ ప్యాక్ లుక్ ని వదులుతూ.. This is just the beginning…Meeku mundu mundu undi pandaga!! ఇది జస్ట్ బిగినింగ్ మాత్రమే.. మీకు ముందు ముందు ఉంది పండగ అంటూ ట్వీట్ చెయ్యడంతో అఖిల ఏజెంట్ పై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. అఖిల్ సిక్స్ ప్యాక్ మేకోవర్ చూస్తే వావ్ అఖిల్ అనకుండా ఉండలేరు. వీపు మీద పెద్ద పచ్చ బొట్టు తో కండలు తిరిగిన దేహంతో అఖిల్ బ్యాక్ లుక్ విపరీతంగా అక్కినేని ఫాన్స్ ని సర్ప్రైజ్ చేసింది.

Tags:    

Similar News