అఖిల్ పరిస్థితి ఏంటో చూడండి..!
వరసగా రెండు చిత్రాలు పోవడం వేరు. కానీ అక్కినేని అఖిల్ కి వరసగా మూడు సినిమాలు బాడ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ [more]
వరసగా రెండు చిత్రాలు పోవడం వేరు. కానీ అక్కినేని అఖిల్ కి వరసగా మూడు సినిమాలు బాడ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ [more]
వరసగా రెండు చిత్రాలు పోవడం వేరు. కానీ అక్కినేని అఖిల్ కి వరసగా మూడు సినిమాలు బాడ్ టాక్ ను సొంతం చేసుకున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన ‘మిస్టర్ మజ్ను’కు యావరేజ్ టాక్ రాగా.. ఓపెనింగ్స్ కూడా అలాగే వచ్చాయి. మొదట ఈ సినిమాపై అంత హోప్స్ లేవు. కానీ బిజినెస్ మాత్రం రూ.22 కోట్లకి జరిగింది. ఒకవేళ సినిమాకి మంచి టాక్ వస్తే ఇది పెద్ద విషయం కాదు. కానీ అలా జరగలేదు. ప్రస్తుతం ఉన్న పొజిషన్ లో ఈ సినిమా రికవర్ చేసే పరిస్థితి కనిపించడం లేదు. మొదటి వీకెండ్ ఈ సినిమా రూ.9.5 కోట్ల షేర్ రాబట్టింది. వీక్ డేస్ లో పరిస్థితి అయితే మరి దారుణంగా ఉంది.
భారీ నష్టం దిశగా…
ఓవరాల్ గా చూసుకుంటే సినిమాకు లాంగ్ రన్ కష్టమే అనిపిస్తోంది. ఫుల్ రన్ లో ఈ సినిమా రూ.15 కోట్ల మార్కును అందుకుంటే ఎక్కువ అన్నట్లుంది. అంటే ఎలాలేదన్నా 7 కోట్లు లాస్ వచ్చే అవకాశం ఉంది. అటు అమెరికాలో కూడా పరిస్థితి ఇంతే. వీకెండ్స్ లో హాఫ్ మిలియన్ ఆశిస్తే.. ఇప్పటిదాకా మొత్తం వసూళ్లు 2 లక్షల డాలర్ల మాత్రమే కలెక్ట్ చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే అఖిల్ కెరీర్ ఇది మూడో ఫ్లాప్‌గా మిగిలేలా ఉంది. నెక్స్ట్ వచ్చే సినిమా ఎట్టి పరిస్థితుల్లో హిట్ అవ్వడం అఖిల్ కు చాలా అవసరం. మరి నాగార్జున ఏం చేస్తాడో చూడాలి.