మెహ్రీన్ కు క్రేజీ ఆఫర్..!

ఈ ఏడాది స్టార్టింగ్ లో ఎఫ్ 2 చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ మెహ్రీన్ కి పాపం ఎందుకో ఆ తరువాత టాలీవుడ్ నుండి ఒక్క [more]

Update: 2019-05-02 08:04 GMT

ఈ ఏడాది స్టార్టింగ్ లో ఎఫ్ 2 చిత్రంతో సూపర్ హిట్ అందుకున్న హీరోయిన్ మెహ్రీన్ కి పాపం ఎందుకో ఆ తరువాత టాలీవుడ్ నుండి ఒక్క ఆఫర్ కూడా రాలేదు. ఈ నేపధ్యంలో ఆమె టాలీవుడ్ కి గుడ్ బై చెప్పబోతోంది అని వార్తలు వచ్చాయి. అయితే ఈ రూమర్స్ కి ఫుల్ స్టాప్ పెడుతూ మరో క్రేజీ ఆఫర్ ను సొంతం చేసుకుంది. గోపీచంద్ – తిరు కాంబినేషన్ లో ఓ చిత్రం తెరకెక్కుతుందని తెలిసిందే. ఈ సినిమాలో మెహ్రీన్ హీరోయిన్ గా ఒకే అయింది. రీసెంట్ గా డైరెక్టర్ తిరు మెహ్రీన్ కి స్టోరీ చేప్పాడట.

ఎట్టకేలకు మరో సినిమాతో మెహ్రీన్

కథ మెహ్రీన్ కు బాగా నచ్చడంతో వెంటనే ఒకే చేసేసిందట. త్వరలోనే ఇది అధికారికంగా ప్రకటించనున్నారు. గతంలో గోపీచంద్ – మెహ్రీన్ కాంబినేషన్ లో ‘పంతం’ అనే సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాను ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జరీన్ ఖాన్ కీలక పాత్రలో నటిస్తుంది. ఈ సినిమా డైరెక్టర్ తమిళ ఇండస్ట్రీకి సంబందించిన వ్యక్తి కావడంతో ఈ మూవీని రెండు భాషల్లో రిలీజ్ చేయనున్నారు.

Tags:    

Similar News