వాల్తేర్ వీరయ్య ఫస్ట్ సాంగ్ మైండ్ బ్లోయింగ్ అంటున్న దేవిశ్రీ

మొదటిపాటలో చిరంజీవి ఎంతో ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేశారని దేవిశ్రీ వెల్లడించారు. ఈ వార్తను లీక్ చేయకుండా కంట్రోల్..;

Update: 2022-11-13 13:52 GMT
waltair veerayya update, devisri prasad

waltair veerayya update

  • whatsapp icon

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమా వాల్తేర్ వీరయ్య. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ నుండి ఇటీవలే టైటిల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అప్పట్నుండి సినిమాపై అంచనాలు పెరిగాయి. ఈ సినిమాకి ప్రముఖ సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా వాల్తేర్ వీరయ్య ఆసక్తికరమైన అప్డేట్ అందించారు. వాల్తేర్ వీరయ్య ఫస్ట్ సాంగ్ చూశానని, మైండ్ బ్లోయింగ్ గా ఉందని తెలిపారు.

మొదటిపాటలో చిరంజీవి ఎంతో ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేశారని దేవిశ్రీ వెల్లడించారు. ఈ వార్తను లీక్ చేయకుండా కంట్రోల్ చేసుకోలేకపోతున్నానని తెలిపారు. అంతేకాదు.. ఈ వారంలోనే వాల్తేర్ వీరయ్య నుండి ఫస్ట్ సింగిల్ విడుదలవుతుందని తెలిపారు. అభిమానులూ.. పార్టీకి రెడీగా ఉండండి.. ఎందుకంటే ఇది బాస్ పార్టీ అని దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు. ఈ హుషారైన పాటలో మెగాస్టార్ సరసన బాలీవుడ్ ముద్దుగుమ్మ ఊర్వశి రౌతేలా నటించింది. 
బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతిహాసన్ నటిస్తోంది.





Tags:    

Similar News