ఆయన పార్టీ ఇస్తే హీరోస్ ఇద్దరు డుమ్మా

ఈ సంక్రాంతి రేస్ లో ఎఫ్ 2 సినిమా తప్ప మరే సినిమా నిలబడలేకపోయింది. వెంకీ – వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ తో ఇరగతీసేయడంతో సినిమా [more]

;

Update: 2019-01-25 02:32 GMT
f3 movie heros telugu news
  • whatsapp icon

ఈ సంక్రాంతి రేస్ లో ఎఫ్ 2 సినిమా తప్ప మరే సినిమా నిలబడలేకపోయింది. వెంకీ – వరుణ్ తేజ్ కామెడీ టైమింగ్ తో ఇరగతీసేయడంతో సినిమా బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అయితే ఈ చిత్ర టీం కు ఏషియన్ సునీల్ రెండు రోజులు కిందట భారీ పార్టీ ఇచ్చారు. డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, నిర్మాత అయిన ఏషియన్ సునీల్ ఇచ్చిన పార్టీ కి హీరోయిన్స్ మెహరీన్, తమన్నా డుమ్మా కొట్టారు.

f2 fun and frustration telugu post telugu news

వెంకీ, వరుణ్ ఇద్దరు వారివారి సినిమాల షూటింగ్స్ తో బిజీగా ఉండడంతో లోకల్ గా లేకపోవడంతో ఈ పార్టీ కి రాలేదు. నిర్మాత దిల్ రాజు..డైరెక్టర్ అనిల్ రావిపూడి..శిరీష్, లక్ష్మణ్ తదితరులు హాజరయ్యారు. సునీల్ కు ఫ్రెండ్ అయినా నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు…మరో నిర్మాత అభిషేక్ నామా కూడా పార్టీకి అటెండ్ అయ్యారు.

ఈ పార్టీ దాదాపు తెల్లవారు ఝాము వరకు కొనసాగడం విశేషం. సినీ జనాలతో రాపో పెంచుకోవడం కోసమే ఇటువంటి పార్టీస్ ఇస్తుంటారు. ప్రస్తుతం ఎఫ్ 2 చిత్రం ఒక రేంజ్ లో ఆడేస్తుంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా ఈసినిమా దూకుడు బాగానే ఉంది

Tags:    

Similar News