జబర్దస్త్ ని అందుకే వదిలేసా..!

ఈటివి లో ప్రసారమయ్యే జబర్దస్త్ క్రేజ్ ఏంటో ఎవ్వరికి చెప్పక్కర్లేదు. జబర్దస్త్ ప్రోగ్రామ్ తో ఇల్లు, కార్లు కొన్న కమెడియన్స్ చాలామంది వెండితెర మీద కూడా కామెడీ [more]

;

Update: 2020-04-23 03:40 GMT
Jabardasth
  • whatsapp icon

ఈటివి లో ప్రసారమయ్యే జబర్దస్త్ క్రేజ్ ఏంటో ఎవ్వరికి చెప్పక్కర్లేదు. జబర్దస్త్ ప్రోగ్రామ్ తో ఇల్లు, కార్లు కొన్న కమెడియన్స్ చాలామంది వెండితెర మీద కూడా కామెడీ చేసుకుంటూ చేతినిండా సంపాదిస్తూ బాగా బిజీగా వున్నారు. అలాంటి జబర్దస్త్ ని నమ్ముకుని చాలామంది చాలా ఏళ్లుగా ఈటివి మల్లెమాల చెప్పినట్టుగా నడుచుకుంటున్నారు. మధ్యలో చాలామంది జబర్దస్త్ వదిలేసినా.. ఎవరికీ జబర్దస్త్ అంత ఫేమ్ ఎక్కడా దొరకలేదు. తాజాగా ఓ స్టార్ కమెడియన్ కూడా జబర్దస్త్ ని సడన్ గా వదిలేసి వెండితెర మీద వెలిగిపోతున్నాడు. అయితే జబర్దస్త్ ని తానెందుకు వదలాల్సి వచ్చిందో చెబుతున్నాడు.

Satya Jabardast

స్వామి రారా సినిమాలో హీరో తో సమానమైన పాత్రతో అదరగొట్టిన సత్య సినిమా అవకాశాలు అంతంతమాత్రంగా ఉన్నప్పుడు జబర్దస్త్ లో చేరి కొన్ని స్కిట్స్ చేసాడు. ధనరాజ్ టీంతో క్రేజ్ సంపాదించుకున్న సత్య జబర్దస్త్ తో మంచి గుర్తింపు పొందాడు. అలాగే మంచి పారితోషకం కూడా అందుకునేవాడు. జబర్దస్త్ లో మంచి క్రేజ్ ఉన్న టైం లో సత్యకి సినిమా అవకాశాలు బాగా పెరగడంతో.. వెండితెర మీద భవిష్యత్తు బావుంటుంది అని.. జబర్దస్త్ ని వదిలెయ్యడం కాస్త సాహసమే అయినప్పటికీ.. తెగించి సత్య జబర్దస్త్ వదులుకున్నాడట. జబర్దస్త్ వదిలేసినా.. సత్యకి వెండితెర మీద ఎదురులేకుండా పోయింది. అందుకే మల్లి జబర్దస్త్ వైపు చూడలేదని చెబుతున్నాడు. తాజాగా సత్య గతఏడాది డిసెంబర్ లో విడుదలైన మత్తువదలరా సినిమాలో సూపర్ కామెడీ పాత్రతో బాగా హైలెట్ అయ్యాడు. తాజాగా సత్య నటించిన రెండు మూడు సినిమాలు విడుదల కావాల్సి ఉంది.

Tags:    

Similar News