సారి నేనలా అనలేదు!!
తెలుగులో బ్లాక్ బస్టర్స్ అందుకున్న శృతి హాసన్ కి ఈమధ్యన వరస ప్లాప్స్ తప్ప మరేదీ లేదు. ప్రస్తుతం క్రాక్ సినిమాలో రవితేజ సరసన నటిస్తున్న శృతి [more]
తెలుగులో బ్లాక్ బస్టర్స్ అందుకున్న శృతి హాసన్ కి ఈమధ్యన వరస ప్లాప్స్ తప్ప మరేదీ లేదు. ప్రస్తుతం క్రాక్ సినిమాలో రవితేజ సరసన నటిస్తున్న శృతి [more]
తెలుగులో బ్లాక్ బస్టర్స్ అందుకున్న శృతి హాసన్ కి ఈమధ్యన వరస ప్లాప్స్ తప్ప మరేదీ లేదు. ప్రస్తుతం క్రాక్ సినిమాలో రవితేజ సరసన నటిస్తున్న శృతి హాసన్ స్టార్ హీరోల అవకాశాలు పెద్దగా రావడం లేదు. అయితే తాజాగా శృతి హాసన్ నేషనల్ మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూలో తాను నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాలైన గబ్బర్ సింగ్, రేసు గుర్రం సినిమాల గురించి తక్కువ చేసి మాట్లాడింది అంటూ తెలుగు వెబ్ మీడియా, సోషల్ మీడియాలో వార్తలు ప్రచారంలోకొచ్చాయి. అయితే కెరీర్ ఆరంభంలో తన వెల్వెషర్స్ తనకి కమర్షిల్ సినిమాలే చెయ్యాలని చెప్పారు.. కానీ నేను ఆ మాటలను ఎక్కువ కలం వినలేదు. అయితే నేను కొన్ని బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించాను.
కానీ ఆ సినిమాలు చేస్తున్న టైం లో నాకు ఆ సినిమాలు చూసినా అంత గొప్పగా అనిపించలేదు. కానీ ఇక మీదట నేను నటించే సినిమాల కథల విషయంలో మంచి ఛాయస్ లను నిజాయితీగా తీసుకుంటానని చెప్పడంతో.. అదిగో పవన్ గబ్బర్ సింగ్, అల్లు అర్జున్ రేసు గుర్రం సినిమాలను శృతి హాసన్ అవమానిస్తూ మాట్లాడింది.. అవి తప్ప శృతి కెరీర్ లో చెప్పుకోదగ్గ బ్లాక్ బస్టర్స్ ఏమున్నాయో చూపించమనండి అంటూ తెలుగు మీడియాలో వార్తలు రావడంతో వెంటనే శృతి హాసన్ సర్దుకుని.. సారి నేనలా అనలేదు. నేను ఇచ్చిన ఇంటర్వ్యూ ని తెలుగు మీడియా సంస్థలు తప్పుగా అర్ధం చేసుకున్నాయి. వాళ్ళు అనుకున్నది నిజం కాదు. నేను రేసు గుర్రం, గబ్బర్ సింగ్ సినిమాల్లో నటించడాన్ని గర్వంగా భావిస్తాను. అసలు పవన్ తో చేసిన గబ్బర్ సింగ్ సినిమానే నా కెరీర్ ని మలుపు తిప్పింది. అలాంటి సౌత్ ఇండస్ట్రీని నేను తక్కువ చేసి ఎందుకు మాట్లాడతాను. నేను మాట్లాడింది ఉత్తరది సినిమాల గురించి అంటూ వివరణ ఇచ్చేసింది.