జనవరి లో ఒకే ఒక హిట్!

2019 మొదలైంది.. అప్పుడే 2019 జనవరి నెల చివరిలో కొచ్చేసింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో సంక్రాతి పండగ స్పెషల్ గా విడుదలవుతున్న సినిమాలకు భయపడి.. జనవరి మొదటి [more]

;

Update: 2019-01-31 06:12 GMT
సినిమా షూటింగులు
  • whatsapp icon

2019 మొదలైంది.. అప్పుడే 2019 జనవరి నెల చివరిలో కొచ్చేసింది. ఈ ఏడాది ప్రథమార్ధంలో సంక్రాతి పండగ స్పెషల్ గా విడుదలవుతున్న సినిమాలకు భయపడి.. జనవరి మొదటి వారంలో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక సంక్రాంతికి పొలోమంటూ మూడు తెలుగు సినిమాలు, ఒక తమిళ సినిమా రోజుకొకటి చొప్పున విడుదలయ్యాయి. ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు జనవరి 9న, రామ్ చరణ్ వినయ విధేయ రామ జనవరి 11న, తమిళ పేట మూవీ జనవరి 10న, వెంకీ – వరుణ్ ల ఎఫ్ 2 జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక ఆ సినిమాల దెబ్బకి మూడో వారంలో అంటే జనవరి మూడో వారంలో ఒక్క సినిమా కూడా విడుదల కాలేదు. ఇక సంక్రాతి ఫలితాలతో పనేమిలేదన్నట్టుగా జనవరి చివరి వారంలో అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను, హిందీలో కంగనా మణికర్ణిక ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇక జనవరి నెల ముగిసిపోయింది.

f2 creating new records in america

ఎఫ్ 2 తప్పించి…

ఇక జనవరి నెలలో విడుదలైన ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు టాక్ సూపర్… కలెక్షన్స్ నిల్. వినయ విధేయరామ టాక్ నెగెటివ్.. కలెక్షన్స్ డల్ కానీ.. పర్లేదు. ఇక పేట అట్టర్ ప్లాప్. అయితే ఈ మూడు పెద్ద సినిమాల మధ్యలో వచ్చిన ఎఫ్ 2 మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కథానాయకుడులో కంటెంట్ లేకపోవడం, వినయ విధేయ రామలో ఫ్యామిలీ డ్రామా, కామెడీ లేకపోవడం.. పేటలో కథ లేకపోవడంతో ప్లాప్ అవగా.. ఎఫ్ 2 కామెడీ హిట్ గా నిలిచింది. ఆ సినిమా ఇప్పడు స్టార్ హీరోల సినిమాలకు వచ్చే కలెక్షన్స్ కొల్లగొడుతూ నిత్యం వార్తల్లోనే ఉంటుంది.

చివరి వారంలోనూ…

ఇక గత శుక్రవారం సోలోగా దిగిన అఖిల్ మిస్టర్ మజ్ను డిజాస్టర్ దిశగా పరుగులు పెడుతుంది. అఖిల్ – వెంకీ అట్లూరిల కాంబోలో వచ్చిన మిస్టర్ మజ్ను టాక్ వీక్… కలెక్షన్స్ వీక్. ఇక బాలీవుడ్ మానికర్ణిక కూడా నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మరి ఈ జనవరిలో కేవలం ఎఫ్ 2 మాత్రమే హిట్ అయ్యి.. మిగతావన్నీ తొంగున్నాయి. మరి ఈ నెల ఇలా ఉంటే.. వచ్చే ఫిబ్రవరి పరిస్థితి ఏమిటో చూడాలి.

Tags:    

Similar News