అలా వెంకీ నుండి బెల్లంకొండకి చేరిందా?

దర్శకుడు తేజ సీత కథను తయారుచేసుకుని కాజల్ ని హీరోయిన్ గా అనుకున్నాక చాలామంది హీరోలు సీత కథను రిజెక్ట్ చేసారని చివరికి బెల్లంకొండ శ్రీనివాస్ సీత [more]

Update: 2019-05-26 16:51 GMT

దర్శకుడు తేజ సీత కథను తయారుచేసుకుని కాజల్ ని హీరోయిన్ గా అనుకున్నాక చాలామంది హీరోలు సీత కథను రిజెక్ట్ చేసారని చివరికి బెల్లంకొండ శ్రీనివాస్ సీత కథను ఒప్పుకుని సినిమా చేసాడు. అయితే సీత కథని ఏ ఏ హీరోలు విన్నారో, ఎవరు రిజెక్ట్ చేసారో అనేది మాత్రం ఇప్పటికి అంతు చిక్కని ప్రశ్నే. తాజాగా ఈ కథ దగ్గుబాటి కాంపౌండ్ నుండి బెల్లంకొండకి చేరినట్లుగా ఇప్పుడొక స్టోరీ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

నేనే రాజు నేనే మంత్రి హిట్ తర్వాత తేజ దగ్గుబాటి కాంపౌండ్ లోనే విక్టరీ వెంకటేష్ కోసం కథ తయారుచేయగా… ఆ కథ సురేష్ ని మెప్పించకపోవడంతో… చాలారోజుల తర్వాత తేజ, దగ్గుబాటి కాంపౌండ్ నుండి బయటికి వచ్చేసి.. అనిల్ సుంకర తో కలిసి వెంకటేష్ కి చెప్పిన కథనే సీత గా బెల్లంకొండ శ్రీనివాస్ కి వినిపించి ఒకే చేపించుకున్నాడనే టాక్ వినబడుతుంది. మరి ఆ కథ లో హీరో పాత్ర వీక్ కావడంతోనే సురేష్ ఒప్పుకోలేదేమో…. అలా ఆ సీత కథతో వెంకీ ప్లాప్ నుండి తప్పించుకోగా… బెల్లంకొండ మాత్రం ఆ ప్లాప్ కి బలయ్యాడు.

Tags:    

Similar News