మహేష్ బాబు వ్యాఖ్యలపై స్పందించిన కంగనా.. కరెక్ట్ అంటూ మద్దతు

మహేశ్‌ బాబు చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ స్పందించారు. తన తాజా సినిమా ధాకడ్‌ ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె..

Update: 2022-05-14 04:22 GMT

ముంబై : టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌బాబు ఇటీవల చేసిన వ్యాఖ్యలు సినిమా ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌గా మారాయి. తనకు తెలుగులోనే కంఫర్ట్‌గా ఉందని, బాలీవుడ్‌ ఇండస్ట్రీ తనను భరించలేదని అనడంతో వివాదం చెలరేగింది. కొంతమంది మహేశ్‌ వ్యాఖ్యలను తప్పుపట్టారు. 'నాకు అన్ని భాషల మీద గౌరవం ఉంది. నాకు తెలుగులో కంఫర్ట్ గా ఉందనే చెప్పాను' అని మహేష్ వివరణ ఇచ్చారు.

మహేశ్‌ బాబు చేసిన వ్యాఖ్యలపై బాలీవుడ్‌ బ్యూటీ కంగనా రనౌత్‌ స్పందించారు. తన తాజా సినిమా ధాకడ్‌ ప్రమోషన్లలో పాల్గొన్న ఆమె.. మహేశ్‌ బాబు చెబుతున్నది నిజమేనని అన్నారు. ఆయన్ను బాలీవుడ్‌ భరించలేదు. ఎందుకంటే బాలీవుడ్‌ నుంచి ఎంతోమంది ఆయనతో సినిమా చేయడానికి సంప్రదించారో నాకు తెలుసు. ప్రస్తుతం టాలీవుడ్‌ అన్ని ఇండస్ట్రీలను అధిగమించి దేశంలోనే నంబర్‌వన్‌ ఇండస్ట్రీగా ఉంది. కాబట్టి ఆయనకు తగిన రెమ్యునరేషన్‌ను బాలీవుడ్‌ ఇవ్వలేదు. అయినా మహేశ్‌ చేసిన వ్యాఖ్యలను ఎందుకు వివాదం చేస్తున్నారో అర్థం కావట్లేదు. టాలీవుడ్‌పైనా.. తాను చేసే పనిపైనా మహేశ్‌ గౌరవం చూపడం వల్లే ఆయన ఈ స్థాయిలో ఉండగలిగారన్నారు కంగనా.
సంచలన దర్శకుడు ఆర్జీవీ కూడా మహేష్ కు మద్దతుగా నిలిచాడు. ఆర్జీవీ మాట్లాడుతూ.."మహేష్‌ అన్న మాటలను తప్పుబట్టడానికి లేదు. ఎందుకంటే, ఎక్కడ సినిమాలు చేయాలి, ఎలాంటి కథలని ఎంచుకోవాలి.. అనేది నటుడిగా తన సొంత నిర్ణయం. అయితే, బాలీవుడ్‌ తనని భరించలేదంటూ మహేశ్‌ చేసిన వ్యాఖ్యలు తనకు అర్థం కాలేదని.. బాలీవుడ్‌ అనేది కేవలం ఒక సంస్థ కాదు. మీడియా వాళ్లే ఆ పేరు సృష్టించారు"అని వర్మ చెప్పుకొచ్చారు.


Tags:    

Similar News