అవార్డు కావాల్సిందే అంటున్న కంగన

‘మణికర్ణిక’లో కంగనా ఎంత అద్భుతంగా నటించిందో అందరికీ తెలిసిందే. ఆమె నటనకు జాతీయ అవార్డులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కంగనానే సెల్ఫ్ [more]

Update: 2019-03-25 10:18 GMT

‘మణికర్ణిక’లో కంగనా ఎంత అద్భుతంగా నటించిందో అందరికీ తెలిసిందే. ఆమె నటనకు జాతీయ అవార్డులు వచ్చే అవకాశం ఉంది. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే కంగనానే సెల్ఫ్ డబ్బా కొట్టుకుంటూ నాకు ఈసారి జాతీయ అవార్డు రావాల్సిందే అని జ్యూరీపై ఎమోషనల్ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగుతుండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. తనకు ఈ సినిమాకు అవార్డు రాకుంటే కమిటీ పనితీరుపై సందేహాలు నెలకొంటాయని కంగనా అంటుంది. లేటెస్ట్ ఇంటర్వ్యూ లో భాగంగా.. ‘మణికర్ణిక’ సినిమాకు జాతీయ అవార్డు అందుకుంటారన్న నమ్మకం ఉందా అని అడిగితే… కొన్నింటికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకపోతే అవార్డుల కమిటీకే అగౌరవం అన్నారు.

నాకంటే ఎవరు..?

అంటే తనకు గానీ, తన సినిమాకి గానీ అవార్డులు రాకపోతే ఆ కమిటీపై అనుమానాలు మొదలవుతాయి అని కంగనా అన్నారు. ఒకవేళ తనకంటే బాగా నటించిన మరొకరికి అవార్డు వస్తే అప్పుడు తాను కమిటీతో ఏకీభవిస్తానని అన్నారు. గత ఏడాది ‘అందాదున్‌’ చిత్రంలో టబు చాలా బాగా నటించారు. ఆమె విషయంలో కమిటీ ఏమనుకుంటుందో చూడాలి. చిత్రం విషయంలో కూడా అంతే. ‘మణికర్ణిక’కు మించి ఏ సినిమాకి అవార్డు వచ్చినా తాను ఏకీభవిస్తాను అని కంగనా అన్నారు.

Tags:    

Similar News