తన బ్రేకప్ రూమర్స్ పై స్పందించిన కియారా

కియారా అద్వానీ.. తెలుగులో ఇప్పటి వరకు చేసింది రెండే రెండు సినిమాలు. ఒకటి మహేష్ బాబు సరసన

Update: 2022-06-17 12:32 GMT

కియారా అద్వానీ.. తెలుగులో ఇప్పటి వరకు చేసింది రెండే రెండు సినిమాలు. ఒకటి మహేష్ బాబు సరసన 'భరత్ అనే నేను', రామ్ చరణ్ సరసన 'వినయ విధేయ రామ'. ఇప్పుడు మరో సినిమా రామ్ చరణ్ తో చేస్తోంది. శంకర్ దర్శకత్వం వహిస్తున్న RC15 లో రామ్ చరణ్‌తో కలిసి కనిపించబోతోంది కియారా అద్వానీ. కియారా సిద్ధార్థ్ మల్హోత్రాతో రిలేషన్ షిప్ లో ఉంది. అయితే ఇటీవల వారిద్దరూ విడిపోయారని పెద్ద ఎత్తున బాలీవుడ్ లో రూమర్స్ వచ్చాయి. ఈ బ్రేకప్ పుకార్ల గురించి కియారా స్పందించింది. ఇలాంటి వాటి గురించి పెద్దగా పట్టించుకోను.. ఆ పుకారు మీ వ్యక్తిగత జీవితానికి సంబంధించినది. నన్ను లేదా నా కుటుంబాన్ని ప్రభావితం చేసిన విషయాలు ఇప్పటి వరకూ నా విషయంలో రాలేదు. 'కానీ నా పర్సనల్ లైఫ్ గురించి వచ్చే కొన్ని విషయాలను చూసినప్పుడు మాత్రం.. ఇవి ఎక్కడి నుండి వస్తున్నాయి అని మాత్రం నేను ప్రశ్నించుకుంటూ ఉంటాను' అని చెప్పుకొచ్చింది. తమ మధ్య ఎటువంటి గొడవలు లేవని చెప్పుకొచ్చింది కియారా.

కెప్టెన్ విక్రమ్ బాత్రా బయోపిక్ ఆధారంగా తెరకెక్కిన షేర్షా చిత్రంలో కియారా మరియు సిద్ధార్థ్ మల్హోత్రా నటించారు. సిద్ధార్థ్ టైటిల్ రోల్ పోషించగా, కియారా అతన్ని ప్రేమించిన డింపుల్ చీమా పాత్రను పోషించింది. కియారా తదుపరి చిత్రం 'జుగ్ జుగ్ జియో'లో కనిపించనుంది. మల్టీస్టారర్‌లో వరుణ్ ధావన్, అనిల్ కపూర్, నీతూ కపూర్, మనీష్ పాల్, ప్రజక్తా కోలి నటించారు. రాజ్ మెహతా దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 24న సినిమా థియేటర్లలో విడుదల కానుంది. సిద్ధార్థ్ మల్హోత్రా ఇండియన్ పోలీస్ ఫోర్స్ వెబ్ సిరీస్ లో నటిస్తూ ఉన్నాడు. రోహిత్ శెట్టి దర్శకత్వం వహిస్తున్న భారీ వెబ్ సిరీస్ ఇది.


Tags:    

Similar News