మహర్షి స్టోరీ ఇదేనా..?

మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న మహర్షి సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోయినా మహర్షి [more]

;

Update: 2019-04-02 06:38 GMT
maharshi movie rayalaseema area collections
  • whatsapp icon

మహేష్ బాబు 25వ చిత్రంగా తెరకెక్కుతున్న మహర్షి సినిమాని వంశీ పైడిపల్లి డైరెక్ట్ చేస్తున్నాడు. వంశీ పైడిపల్లి కెరీర్ లో ఒక్క బ్లాక్ బస్టర్ లేకపోయినా మహర్షి కథ నచ్చి మహేష్ బాబు ఈ సినిమాని చేస్తున్నాడు. మహర్షి సినిమా మే 9న విడుదల కాబోతుండగా ఇంకా ఇప్పటివరకు షూటింగ్ కంప్లీట్ చేసుకోలేదు. ఇంకా రెండు పాటలు, ప్యాచ్ వర్క్ పెండింగ్ ఉందట. ఇకపోతే ఈ సినిమాలో అల్లరి నరేష్ ఓ కీరోల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇందుకోసం ఏకంగా కోటిన్నర అందుకుంటున్నాడనే టాక్ ఉంది. తాజాగా మహర్షి సినిమా కథ లీక్ అంటూ కొన్ని వార్తలు సామజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అదేమిటంటే మొదటి నుండి మహర్షి కథగా ప్రచారమవుతున్నదే.

నరేష్ ఆశయాల కోసం…

అల్లరి నరేష్ – మహేష్ – పూజ మంచి ఫ్రెండ్స్. ఇక చదువులైపోయాక మహేష్ అమెరికాకి, అల్లరి నరేష్ ఊరికి వెళ్లిపోగా… నరేష్ పాత్ర కొన్ని కారణాల వల్ల చనిపోగా మహేష్ స్నేహితుడి ఆశయాల కోసం, ఉన్న కోట్లాది ఆస్తిని వదులుకుని స్నేహితుడి ఊరికి రావడమే కాదు…. అక్కడ గ్రామస్తులకు చేదోడువాదోడుగా ఉంటూ స్నేహితుడు కలలు కన్న గ్రామంగా ఆ ఊరిని తీర్చిదిద్దుతాడట. ఇక అల్లరి నరేష్ పాత్రని దర్శకుడు ఫస్ట్ హాఫ్ లోనే చంపేస్తాడని.. సెకండ్ హాఫ్ మొత్తం అల్లరి ఆశయాల కోసమే మహేష్ పనిచేస్తాడని అంటున్నారు. మరి మహర్షి కథ ఇదే అంటూ జరుగుతున్న ప్రచారంలో నిజమెంతుందో అనేది మే 9న కానీ రివీల్ అవదు.

Tags:    

Similar News