మ‌హ‌ర్షి క‌థ కూడా కాపీనేనా..?

గత కొంతకాలంగా టాలీవుడ్ లో తరుచు వింటున్న మాట కాపీ క్యాట్. ఫలానా వాళ్ల‌ లైన్ ఫలానా వాళ్లు వాడేసుకున్నారని ఫలానా సీన్ వాడేసుకున్నారు అని ఇలా [more]

Update: 2019-05-11 08:36 GMT

గత కొంతకాలంగా టాలీవుడ్ లో తరుచు వింటున్న మాట కాపీ క్యాట్. ఫలానా వాళ్ల‌ లైన్ ఫలానా వాళ్లు వాడేసుకున్నారని ఫలానా సీన్ వాడేసుకున్నారు అని ఇలా మనం ఎప్పుడూ వింటూనే ఉంటాం. అయితే రెండు రోజుల క్రితం రిలీజ్ అయిన మహర్షి సినిమా కథ కూడా కాపీ క్యాట్ అనే ఫిలింనగర్ గుసగుసల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. అసలు ఇంతకీ మహర్షి కథ ఎవరిది.? ఈ సినిమా కథ శ్రీవాస్ అనే ప్రముఖ దర్శకుడిది అని టాక్ వినిపిస్తుంది. ఈ కథ దిల్ రాజు కాంపౌండ్ నుండే బయటకు వెళ్లిందని చెబుతున్నారు. మహర్షి థీమ్ తన ఇమాజినేషన్ నుంచి పుట్టిన కథ అని దర్శకుడు శ్రీవాస్ దిల్ రాజుని సినిమా చూశాక ప్రశ్నించారట. అయితే అందరిలా ఇతను కేసు వేయడం కానీ, డిబేట్లు పెట్టడం కానీ చేయలేదు. అలానే దర్శకుడిపై కానీ, నిర్మాతపై కానీ ఫిర్యాదు చేసే ఆలోచనలో లేడు.

బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చిన దిల్ రాజు

కేవలం దిల్ రాజుతో ఆర్గ్యూ చేసి వదిలేశారని తెలుస్తోంది. కారణం దీనికి ప్రత్యామ్నాయంగా దిల్ రాజు తనకు బంపర్ ఆఫర్ ఇచ్చాడట. తన బ్యానర్ లో శ్రీవాస్ కు దర్శకత్వం చేసే ఆఫర్ ఇచ్చాడని చెబుతున్నారు. దిల్ రాజు – శ్రీవాస్ ఎప్పటినుండో మంచి స్నేహంగా ఉండేవారు. శ్రీవాస్ అనే ఈ డైరెక్టర్ గతంలో దిల్ రాజు బ్యానర్ లో 'రామ రామ కృష్ణ కృష్ణ' సినిమాని తెరకెక్కించారు. రామ్ హీరోగా నటించిన ఈ సినిమా ఫ్లాప్ అయ్యింది. అప్పటి నుండి వీరిద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. అందుకే డైరెక్టర్స్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసే ఆలోచనను శ్రీవాస్ విరమించుకున్నారన్నది ఇన్ సైడ్ టాక్.

Tags:    

Similar News