నెగెటీవ్ టాక్ వచ్చినా..!

తెలుగులో ఈ ఏడాది భారీ బడ్జెట్ తో నిర్మితమైన వినయ విధేయ రామ ఫస్ట్ షోకే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. రామ్ చరణ్ – బోయపాటి [more]

Update: 2019-01-29 06:17 GMT

తెలుగులో ఈ ఏడాది భారీ బడ్జెట్ తో నిర్మితమైన వినయ విధేయ రామ ఫస్ట్ షోకే నెగటివ్ టాక్ సొంతం చేసుకుంది. రామ్ చరణ్ – బోయపాటి కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా నెగెటివ్ టాక్ వచ్చిన కలెక్షన్స్ పరంగా నిర్మాతలకు పెద్దగా నష్టాలు రాకుండా ఆపింది. రంగస్థలం క్రేజ్ రామ్ చరణ్ కి ఉండడంతో వినయ విధేయ రామకి ఆ మాత్రం కలెక్షన్స్ వచ్చాయి. తాజాగా మరో మూవీ నెగెటివ్ టాక్ తో వసూళ్ల వర్షం కురిపిస్తోంది. అది ఒక బాలీవుడ్ మూవీ. టాలీవుడ్ దర్శకుడు లాస్ట్ మినిట్ లో వదిలేసి వచ్చిన మణికర్ణిక రిపబ్లిక్ డే సందర్భంగా విడుదలైంది.

క్రిష్ నోరు విప్పడంతో…

అయితే సినిమాలో విషయం లేకపోయినా… కంగనా నటనకు, ఆమె దర్శకత్వానికి మంచి మార్కులు పడడం.. సినిమా విడుదలయ్యే వరకు ఎందుకు మణికర్ణిక సినిమా నుండి బయటికొచ్చాడో క్లారిటీ ఇవ్వని దర్శకుడు క్రిష్ మణికర్ణిక సినిమా విడుదలయ్యాక ఆ సినిమా అంతా తానె డైరెక్ట్ చేస్తే కంగనా దర్శకత్వానికి పేరేసుకుందని సంచలనంగా మట్లాడడం, అసలు తాను డైరెక్ట్ చేసినట్టుగా సినిమా ఉంటే… సినిమా చాలా బాగుండేదని.. కానీ కంగనా అండ్ టీం మొత్తం చెడగొట్టింది అంటూ మాట్లాడడంతో… మణికర్ణిక సినిమా మీద ప్రేక్షకుల్లో బాగా ఇంట్రెస్ట్ పెరిగినట్లుగా అనిపిస్తుంది.

వంద కోట్ల క్లబ్ లోకి చేరేలా…

అందుకే నెగెటివ్ టాక్ తోనే మణికర్ణిక మంచి కలెక్షన్ తో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. మొదటి రోజు నెగెటివ్ టాక్ తోనే మంచి ఓపెనింగ్స్ సొంతం చేసుకున్న ఈ సినిమా రెండో రోజు రిపబ్లిక్ డే బాగా కలిసొచ్చింది. అలాగే విడుదలైన మూడు రోజుల్లోనే 45 కోట్లు కొల్లగొట్టిన ఈ సినిమా అతి తక్కువ సమయంలో 100 కోట్ల క్లబ్బులో చేరడం ఖాయంగా కనబడుతుంది. అలాగే ఓవర్సీస్ లో కూడా మణికర్ణిక దూకుడు మాములుగా లేదు. ఇప్పటికే ఒక మిలియన్ డాలర్ల క్లబ్ లో చేరిన మణికర్ణికలో లక్ష్మీబాయి లుక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. అందుకే నెగెటివ్ టాక్, వివాదాలతోనూ కలెక్షన్స్ పరంగా మణికర్ణిక అదరగొట్టేస్తుంది.

Tags:    

Similar News