హీరోయిన్ మెహ్రీన్ పెళ్లి.. మీకు తెలుసా?

హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేతిలో ఉన్నా.. అమ్మడుకి స్టార్ హీరో అవకాశాలైతే రాలేదు. బాగా బరువు తగ్గి స్లిమ్ [more]

Update: 2021-02-13 12:04 GMT

హీరోయిన్ మెహ్రీన్ కౌర్ ఎఫ్ 2 లాంటి బ్లాక్ బస్టర్ మూవీ చేతిలో ఉన్నా.. అమ్మడుకి స్టార్ హీరో అవకాశాలైతే రాలేదు. బాగా బరువు తగ్గి స్లిమ్ గా తయారైనా మెహ్రీన్ ని ఎవరూ పట్టించుకోవడం లేదు. పెద్దగా అవకాశాలు లేకపోయినా.. ప్రస్తుతం ఎఫ్ 3 షూటింగ్ లో బిజీగా ఉంది మెహ్రీన్. అనిల్ రావిపూడి – వెంకటేష్ – వరుణ్ తేజ్ కాంబోలో భారీ అంచనాల మధ్యన తెరకెక్కుతున్న ఎఫ్ 3 లో మెహ్రీన్ హీరోయిన్ గా నటిస్తుంది. తమన్నా మరో హీరోయిన్ గా నటిస్తున్న ఎఫ్3 షూటింగ్ చిత్రీకరణ యమా ఫాస్ట్ చిత్రీకరిస్తున్నారు అనిల్ రావిపూడి. 

అయితే ప్రస్తుతం సినిమాలతో బిజీగా ఉన్న మెహ్రీన్ పెళ్లి చేసుకోబోతుంది. ఇది ఆమె అభిమానులకి షాకింగ్ విషయమే. కెరీర్ లో ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మెహ్రీన్ కి అప్పుడే పెళ్లా? అని అంటున్నారు. నిజమే మెహ్రీన్ పెళ్లి ఖాయమైంది. త్వరలోనే మెహ్రీన్ ఓ ఇంటి కోడలిగా అడుగుపెట్టబోతుంది. అది కూడా పొలిటికల్ బ్యాగ్రౌండ్ ఉన్నా ఫ్యామిలోకి. హర్యానా మాజీ చీఫ్ మినిస్టర్, ఎక్స్ ఫార్మర్ లేట్ భజన లాల్ వాళ్ళ  మనవడు, ఆదమ్ పూర్ ఎమ్యెల్యే కులదీప్ బిష్ణోయ్ కొడుకు భవ్య బిష్ణయ్ తో హీరయిన్ మెహ్రీన్ కౌర్ ఎంగేజ్మెంట్ మార్చ్ 13 న రాజస్థాన్ లోని జైపూర్ అలీల ఫోర్ట్ లో కొద్దిమంది బందు మిత్రుల మధ్యన జరగబోతుంది. ప్రస్తుతం మెహ్రీన్ కాబోయే భర్త భవ్య బిష్ణయ్ తో దిగిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. 

Tags:    

Similar News