ఈ వారం థియేటర్లు, ఓటీటీల్లో విడుదలవుతున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు
30 వెడ్స్ 21 సిరీస్ ఫేమ్ చైతన్య రావు, లావణ్య జంటగా నటించిన ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ జులై 21న థియేటర్లలోకి రానుంది.
బాక్సాఫీస్ వద్ద రెండు వారాలుగా వస్తున్న సినిమాలు మంచి విజయాలందుకుంటున్నాయి. స్టార్ హీరోల సినిమాలు లేకపోయినా.. చిన్న సినిమాలే కాసుల వర్షం కురిపిస్తున్నాయి. కంటెంట్ ఉంటే చాలు..ఆ సినిమాలకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడతారని మరోసారి రుజువు చేశాయి సామజవరగమన, బేబీ సినిమాలు. ఇక ఈ వారం కూడా థియేటర్లలో మంచి బజ్ ఉన్న సినిమాలు విడుదలవుతున్నాయి. లవ్, క్రైమ్, రొమాన్స్.. ఇలా అన్ని జోనర్లలోనూ సినిమాలు విడుదలవుతుండటం విశేషం. ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు, నందిత శ్వేతా జంటగా నటించిన యాక్షన్ థ్రిల్లర్ ‘హిడింబ’ సినిమా జులై 20న రిలీజ్ కాబోతుంది.
30 వెడ్స్ 21 సిరీస్ ఫేమ్ చైతన్య రావు, లావణ్య జంటగా నటించిన ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ జులై 21న థియేటర్లలోకి రానుంది. ఈ సినిమా 90లలో ప్రేమ కథలా ఉండబోతుంది. ఇటీవలే బిచ్చగాడు 2తో హిట్ అందుకున్న విజయ్ ఆంటోనీ.. ఈ వారం‘హత్య’ సినిమాతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నాడు. మీనాక్షి చౌదరి నటించిన ఈ సినిమా జులై 21న విడుదల కాబోతోంది. రుహానీ శర్మ మెయిన్ లీడ్ లో తెరకెక్కిన ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా ‘HER’ జులై 21న థియేటర్స్ లో రిలీజ్ కానుంది. బ్రహ్మాజీ తనయుడు, ఓ పిట్టకథ ఫేమ్ సంజయ్, ప్రణవి జంటగా నటించిన స్లమ్ డాగ్ హస్బెండ్ సినిమా జులై 21న రాబోతుంది. ఈ సినిమా ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ లా ఉండబోతుంది.
ఇంకా.. అలా ఎలా ఇలా, జిలేబి, నాతో నేను, ఒక్కడే వీరుడు.. అనే చిన్న సినిమాలు జులై 21న రిలీజ్ కాబోతున్నాయి. వీటిలో జిలేబి, నాతో నేను సినిమాల విడుదల వాయిదా పడొచ్చని సమాచారం. ఇక హాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిస్టోఫర్ నోలాన్ దర్శకత్వంలో రాబోతున్న ఒప్పెన్ హైమర్ సినిమా డబ్బింగ్ లో జులై 20న రిలీజ్ కానుంది. మరో డబ్బింగ్ సినిమా నాగ ద్వీపం కూడా జులై 22న రిలీజ్ కానుంది.
ఓటీటీల్లో విడుదలయ్యే సినిమాల విషయానికొస్తే.. అమెజాన్ ప్రైమ్ ల జులై 21 నుంచి బవాల్ హిందీ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. అలాగే నెట్ ఫ్లిక్స్ లో జులై 17న అన్నోన్- కేవ్ ఆఫ్ బోన్స్, 19న ది డీపెస్ట్ బ్రీత్, 20న స్వీట్ మంగోలియాస్ వెబ్ సిరీస్, 21నదే క్లోన్ డ్ టైరోస్ స్ట్రీమింగ్ కు రానున్నాయి. జీ 5లో జులై 18 నుంచి స్పైడర్ మ్యాన్ ఎక్రాస్ ది స్పైడర్స్ వర్స్ యానిమేషన్ మూవీ స్ట్రీమ్ అవనుంది. జియోలో ట్రయల్ పీరియడ్ హిందీ సినిమా జులై 21 నుండి, స్పెషల్ ఒప్స్ - లయనెస్ జులై 23 నుండి స్ట్రీమింగ్ అవనుంది.