ఓటీటీలో విడుదలకు రెడీ అవుతోన్న "లక్ష్య"
సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదలై.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది.
మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ యంగ్ హీరో నాగశౌర్య, "రొమాంటిక్" హీరోయిన్ కేతిక శర్మ జంటగా వచ్చిన చిత్రం లక్ష్య. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా డిసెంబర్ 10వ తేదీన థియేటర్లలో విడుదలై.. మంచి టాక్ ను సొంతం చేసుకుంది. సోనాలి నారంగ్ సమర్ఫణలో శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పి, నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నారాయణ్ దాస్ కే నారంగ్, పుస్కర్ రామ్ మోహన్ రావు, శరత్ మరార్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. విలువిద్య నేపథ్యంలో సాగే ఈ సినిమా కోసం నాగశౌర్య ప్రత్యేకంగా శిక్షణ తీసుకోవడంతో పాటు.. సిక్స్ ప్యాక్ కోసం చాలా కష్టపడ్డాడు.
జనవరి 7 నుంచి..
రెండు డిఫరెంట్ లుక్స్ లో అలరించిన నాగశౌర్యకు.. ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. నాగశౌర్య నటించిన ఈ సినిమా ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమైంది. సినిమా విడుదలై నెలరోజులైనా కాకముందే ఓటీటీలో విడుదలవుతుండటం విశేషం. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఆహా ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకుంది. 2022 జనవరి 7 నుంచి లక్ష్య సినిమా ఆహా లో స్టీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆహా.. తన అఫిషియల్ ట్విట్టర్ ఖాతా ద్వారా అధికారికంగా ప్రకటించింది.