యంగ్ ఎమ్యెల్యేగా బాలయ్యని గడగడలాడిస్తాడా?

బోయపాటి డైరెక్ట్ చేసే సినిమాల్లో హీరో కుండే ఇంపార్టెన్స్ విలన్ కి ఉంటుంది. విలన్ పాత్రలను చాలా బలంగా చూపిస్తాడు బోయపాటి. హీరోగా avakasalu లేని జగపతి [more]

;

Update: 2020-08-11 05:59 GMT
naveen chandra as villain in kollywood
  • whatsapp icon

బోయపాటి డైరెక్ట్ చేసే సినిమాల్లో హీరో కుండే ఇంపార్టెన్స్ విలన్ కి ఉంటుంది. విలన్ పాత్రలను చాలా బలంగా చూపిస్తాడు బోయపాటి. హీరోగా avakasalu లేని జగపతి బాబుని లెజెండ్ లో పవర్ ఫుల్ విలన్ గా చూపించాడు. అలాగే అది పినిశెట్టిని సరైనోడు సినిమాలో సూపర్ విలన్ గా చూపించాడు. ఇక తాజాగా హీరో నవీన్ చంద్రని కూడా ఓ పవర్ ఫుల్ యంగ్ ఎమ్యెల్యేగా బాలయ్య సినిమాలో చూపించబోతున్నాడట. నవీన్ చంద్ర ఇప్పటికే విలన్ పాత్రకు బాగా సెట్ అవుతున్నాడు. తెలుగులో అరవింద సమేత, తమిళనాట ధనుష్ లోకల్ బాయ్ లోను విలన్ గా అదరగొట్టేసాడు.

కానీ బోయపాటి సినిమాల్లోని విలన్ గా ఇప్పటివరకు పవర్ ఫుల్ పాత్ర పడలేదు నవీన్ చంద్ర కి. కానీ తాజాగా బాలయ్య – బోయపాటి కొత్త సినిమాలో నవీన్ చంద్ర ని పవర్ ఫుల్ యంగ్ ఎమ్యెల్యేగా చూపించబోతున్నాడట. మరి యంగ్ విలన్ ఎమ్యెల్యే బాలయ్యని భయపెడతాడో.. లేదంటే బాలయ్యే ఆ ఎమ్యెల్యేని పరిగెత్తిస్తాడో తెలియదు కానీ… ప్రస్తుతం బాలయ్య – బోయపాటి సినిమాపై భీభత్సమైన అంచనాలున్నాయి. కారణం ఇంతవరకు వారి కాంబోలో అన్ని బ్లాక్ బస్టర్స్ ఉండడం ఒకటైతే.. మరొకటి.. #BB3 టీజర్ అదరగొట్టడమే. మరి మరోనా తగ్గేవరకూ బాలయ్య – బోయపాటి కూడా సినిమా సెట్స్ మీదకెళ్లేలా కనిపించడం లేదు. 

Tags:    

Similar News