అందుకే పెళ్ళికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందా?

కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార సినిమాల్తోనే కాదు.. వ్యక్తిగతంగా ప్రేమలోనూ ఎప్పుడు బిజినె. ఇప్పటికి ముగ్గురుతో ప్రేమాయణం నడిపిన నయనతార ముందు ఇద్దరు అంటే శింబు, [more]

Update: 2020-06-02 04:15 GMT

కోలీవుడ్ లేడి సూపర్ స్టార్ నయనతార సినిమాల్తోనే కాదు.. వ్యక్తిగతంగా ప్రేమలోనూ ఎప్పుడు బిజినె. ఇప్పటికి ముగ్గురుతో ప్రేమాయణం నడిపిన నయనతార ముందు ఇద్దరు అంటే శింబు, ప్రభుదేవా లకి బ్రేకప్ చెప్పింది మాత్రం ప్రేమలో నమ్మకం లేకనే అంటుంది. నమ్మకం లేకనే ప్రేమలో రెండు సార్లు ఫెయిల్ అయ్యా అని చెప్పిన నయనతారకి ఇప్పటికీ పెళ్లి అంటే భయమే. అందుకే దర్శకుడు విగ్నేష్ శివన్ తో నయనతార కలిసి ఉన్నప్పటికీ.. పెళ్లి పేరెత్తడం లేదు.

కానీ విగ్నేష్ శివన్ మాత్రం నయనతార ని పెళ్ళికి సిద్ధం కమ్మంటున్నాడట. ఇప్పటివరకు నువ్ ఏం చెబితే అలానే. కానీ మా ఇంట్లో పెళ్లిపై ఒత్తిడి పెరుగుతుంది.. సో మనం పెళ్లి చేసేసుకుందాం అంటున్నాడట. అయితే నయనతార కూడా పెళ్లి విషయంలో మెత్తబడింది అని.. అందుకే మొన్నామధ్యన అంటే మహిళా దినోత్సవం రోజున నయనతారే నా బిడ్డలకు తల్లి అంటూ నయనతార పసిబిడ్డని ఎత్తుకున్న పిక్ షేర్ చేసాడు. ఇలా లాక్ డౌన్ కలిసి నయనతార విగ్నేష్ పెళ్లి విషయంలో ఓ అభిప్రాయానికి వచ్చారట, త్వరలోనే వీరి ప్రేమకు శుభం కార్డు.. పెళ్ళికి శుభలేఖలు అచ్చవుతాయని అంటున్నారు.

Tags:    

Similar News