అన్నదమ్ములను నమ్ముకుని దెబ్బైపోయింది..!

బాలీవుడ్ నుండి చందూ మొండేటి.. నాగ చైతన్య సవ్యసాచి కోసం నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం చేసాడు. నిధి అగర్వాల్ స్పైసీ [more]

Update: 2019-01-26 06:28 GMT

బాలీవుడ్ నుండి చందూ మొండేటి.. నాగ చైతన్య సవ్యసాచి కోసం నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా టాలీవుడ్ కి పరిచయం చేసాడు. నిధి అగర్వాల్ స్పైసీ లుక్స్ తో ఆకర్షించేలా కనబడే సరికి.. సవ్యసాచితో హిట్ కొడితే అమ్మడు ఫేట్ మారి బిజీ హీరోయిన్ అవుతుంది అనుకుంటుండగా… అక్కినేని అఖిల్.. సవ్యసాచి విడుదల కాకముందే తన మూడో సినిమాలో హీరోయిన్ గా అవకాశమిచ్చాడు. మరి సవ్యసాచిలో నిధి అగర్వాల్ అందాల ఆరబోత, హాట్ హాట్ గ్లామర్ లుక్స్ ఆకట్టుకున్నప్పటికీ.. ఆమెకు నటనలో పెద్దగా మెళకువలు తెలియకపోవడం, ప్రాధాన్యమైన పాత్ర కాకపోవడం, సినిమా డిజాస్టర్ అవ్వడంతో పాపం నిధికి.. చైతు ఫ్లాప్ ఇచ్చాడు. కనీసం తమ్ముడైనా హిట్ ఇస్తాడో లేదో అన్నారు.

ఇలా అయితే టాలీవుడ్ లో కష్టమే…

నిధి – అఖిల్ అక్కినేని నటించిన మిస్టర్ మజ్ను నిన్న విడుదలైంది. ఈ సినిమాలోనూ నిధి అగర్వాల్ హాట్ యాంగిల్ లో రెచ్చిపోయింది. కానీ నటనలో ఇంకా మెరుగు పడాల్సి ఉంది అని అన్నారు విమర్శకులు. ఇక ఈ సినిమాలో నిధి అగర్వాల్ మాత్రం తన వీకెస్ట్ పెర్ఫార్మెన్స్‌ పుణ్యమా అని ఎక్కడా ఇంప్రెస్ చెయ్యలేకపోయిందని అంటున్నారు. సాయి పల్లవి లాంటి హీరోయిన్స్ బ్రిలియెంట్ పెర్ఫార్మెన్స్ ఇస్తున్న సమయంలో ప్రేక్షకులు ఇలాంటి హీరోయిన్స్‌ ని యాక్సెప్ట్ చేయడం కష్టమే అని కొందరు అంటున్నారు. ఇక, డైరెక్టర్ కూడా నిధి అగర్వాల్ క్యారెక్టర్‌ని కరెక్ట్‌ గా డిజైన్ చేయలేకపోయాడని మరి కొందరి మాట. అయితే, అఖిల్ పక్కన నటనలో వేరే హీరోయిన్ అయితే ముదురుగా అనిపించే ప్రమాదం ఉందని.. ఇప్పుడిప్పులే నటనలో ఓనమాలు దిద్దుతున్న నిధిని తీసుకున్నట్టున్నారు.

ఇద్దరూ హిట్ ఇవ్వలేకపోయారు…

అయితే మిస్టర్ మజ్నులో నిక్కీ పాత్రని పండించడానికి అనుభవం చాలా అవసరం. లేదంటే కనీసం అభినయం తెలిసిన నటి అయినా కీలకం. అందుకే నటనలో ఏం తెలియని నిధి అగర్వాల్ చాలా సన్నివేశాల్లో తేలిపోయింది. పాత్రకు సెట్టయింది కానీ.. ఆమె ప్రత్యేకత అంటూ ఏమీ కనిపించదు అని మరొకరు నిధి అగర్వాల్ నటన గురించి చెబుతున్నారు. మరి నిధికి అన్న నాగ చైతన్య, తమ్ముడు అఖిల్ కూడా సూపర్ హిట్ ఇవ్వలేకపోయారు. పాపం నిధి అనాలనిపిస్తుంది కదూ..!

Tags:    

Similar News