వేణు శ్రీరాంకి హ్యాండ్ ఇవ్వడం పక్కా?
అల్లు అర్జున్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ అవడంతో.. అల్లు అర్జున్ ఎక్కడా ఆగడం లేదు. అలా వైకుంఠపురములో తర్వాత అల్లు [more]
అల్లు అర్జున్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ అవడంతో.. అల్లు అర్జున్ ఎక్కడా ఆగడం లేదు. అలా వైకుంఠపురములో తర్వాత అల్లు [more]
అల్లు అర్జున్ మంచి ఫామ్ లో ఉన్నాడు. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ అవడంతో.. అల్లు అర్జున్ ఎక్కడా ఆగడం లేదు. అలా వైకుంఠపురములో తర్వాత అల్లు అర్జున్ సుకుమార్ తో ఓ సినిమా, వేణు శ్రీరామ్ తో మరో సినిమా అనౌన్స్ చెయ్యగా.. వేణు శ్రీరామ్ యమా స్పీడుగా అల్లు అర్జున్ చిత్రానికి టైటిల్ అండ్ ఫస్ట్ లుక్ కూడా వదిలాడు. అల్లు అర్జున్ – వేణు శ్రీరామ్ కాంబో మూవీ కి ఐకాన్ అని టైటిల్ పెట్టి లుక్ వదిలేసారు. ఆ తర్వాత మళ్ళీ వేణు శ్రీరామ్ – అల్లు అర్జున్ కాంబో సోదిలో లేకుండా పోయింది. ముందు వేణు శ్రీరామ్ మూవీ అనుకుంటే.. ముందుగా సుకుమర్ లైన్ లోకొచ్చి.. పుష్ప సినిమాని పాన్ ఇండియా లేవల్లో అనౌన్స్ చేయడంతోనే అల్లు అర్జున్ ఐకాన్ ఆగిపోయినట్లుగా గా వార్తలొచ్చాయి. అప్పుడు కూడా వేణు శ్రీరామ్ కానీ, అల్లు అర్జున్ కానీ ఎం మాట్లాడలేదు. మధ్యలో ఏదో ఫెస్టివల్ కి ఐకాన్ ఉన్నట్లుగా మళ్ళీ పోస్టర్ వదిలారు.
తాజాగా అల్లు అర్జున్ వరస చూస్తుంటే ఐకాన్ అటకెక్కించినట్లుగానే అనిపిస్తుంది. కొరటాల తో గుట్టు చప్పుడు కాకుండా AA21 పోస్టర్ తో సహా అధికారిక ప్రకటన ఇప్పించాడు అల్లు అర్జున్. ఐకాన్ సినిమా ఉంటుంది అని కానీ, లేదు అని కానీ చెప్పకుండా కొరటాల తో మూవీ అంటూ ప్రకటించాడు. పోనీ కొరటాల ఖాళీగా ఉన్నాడా? అల్లు అర్జున్ ఖాళీగా ఉన్నాడా? అది లేదు. కొరటాల ఆచార్యతో, అల్లు అర్జున్ పుష్ప తో బిజీ. అలాంటి టైం లో అల్లు అర్జున్ – కొరటాల కాంబో మూవీ సెట్ అయ్యింది అంటే ఖచ్చితంగా వేణు శ్రీరామ్ కి అల్లు అర్జున్ హ్యాండ్ ఇచ్చాడనే దానర్ధం. మరి వేణు శ్రీరామ్ వకీల్ సాబ్ తర్వాత అల్లు అర్జున్ తో సినిమా అనుకుంటే పాపం అల్లు అర్జున్ ఆశపెట్టి అటకెక్కించాడు. మరి వేణు శ్రీరామ్ నెక్స్ట్ మూవీపై ఇప్పుడు అందరిలో ఆసక్తి నెలకొని ఉంది.