కొహినూరు చుట్టూ తిరుగుతున్న పవన్?

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ టైటిల్ వకీల్ సాబ్ తో పాటుగా పవన్ లుక్ కూడా బయటికొచ్చేసింది. పవన్ ఫ్యాన్స్ లో ఉన్న క్యూరియాసిటీ కాస్తో కూస్తో [more]

Update: 2020-03-06 07:15 GMT

పవన్ కళ్యాణ్ పింక్ రీమేక్ టైటిల్ వకీల్ సాబ్ తో పాటుగా పవన్ లుక్ కూడా బయటికొచ్చేసింది. పవన్ ఫ్యాన్స్ లో ఉన్న క్యూరియాసిటీ కాస్తో కూస్తో తగ్గింది. రెండేళ్లుగా వెండితెరకు దూరమైన పవన్ మల్లి స్క్రీన్ మీద ఎలా ఉంటాడో అనే క్యూరియాసిటీకి వకీల్ సాబ్ లుక్ తో తెరపడింది. ఇక క్రిష్ తో పవన్ కళ్యాణ్ సినిమా అప్పుడే ఓ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుని రెండో షెడ్యూల్ కి రేడి అవుతుంది. ఇప్పటికే క్రిష్ అల్యూమినియం ఫ్యాక్టరీలో వేసిన సెట్ లో పవన్ కళ్యాణ్ తో చాలా సీన్స్ షూట్ చేస్తున్నాడు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ దొంగగా కనబడతాడని… ఔరంగ‌జేబు ప‌రిపాల‌నా కాలం నాటి క‌థతో ఈ సినిమా పిరియాడికల్ డ్రామా గా తెరకెక్కుతుంది అనే టాక్ ఉంది.

ఆ కాలంనాటి సాంఘిక‌, ఆర్థిక, రాజ‌కీయ ప‌రిస్థితుల్ని తెర‌పై చూపించ‌బోతున్నారని, అలాగే పవన్ కళ్యాణ్ దొంగగా.. కొహినూరు వజ్రం కోసం ట్రై చేస్తాడని అంటున్నారు. సినిమా కథ మొత్తం కొహినూరు డైమండ్ చుట్టూతానే తిరుగుతుంది అంటే.. దొంగ గా పవన్ కళ్యాణ్ కూడా కొహినూరు వజ్రాన్ని కొట్టెయ్యడానికి ప్లాన్ చేస్తాడేమో అంటున్నారు. ఇక పవన్ తో జోడి కోసం ఇప్పటికే కీర్తి సురేష్, ప్రగ్య జైస్వాల్ పేర్లు వినబడుతుండగా.. మరో హీరోయిన్ గా బాలీవుడ్ భామ జాక్విలెన్ ఫెర్నాండేజ్ పేరు ప్రచారంలోకొచ్చింది. ఇంకా ఏ ఒక్క హీరోయిన్ క్రిష్ ఫైనల్ చెయ్యలేదు కానీ… ఈసినిమా టైటిల్ గా విరూపాక్ష అనే టైటిల్ మాత్రం బాగా ప్రచారంలోకొచ్చింది.

Tags:    

Similar News