సాహో అంటే ఇంతేమరి

స్టార్ హీరోస్ ఫంక్షన్స్ చేయాలంటే చాలా దైర్యం కావాలి. ఎందుకంటే భారీ లెవెల్ లో ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ భారీగా వస్తుంటారు. వారిని కంట్రోల్ చేసుకోవాలి. ఏమాత్రం [more]

Update: 2019-08-19 07:52 GMT

స్టార్ హీరోస్ ఫంక్షన్స్ చేయాలంటే చాలా దైర్యం కావాలి. ఎందుకంటే భారీ లెవెల్ లో ఫంక్షన్స్ చేస్తున్నప్పుడు ఫ్యాన్స్ భారీగా వస్తుంటారు. వారిని కంట్రోల్ చేసుకోవాలి. ఏమాత్రం చిన్న పొరపాటు జరిగినా తగిన మూల్యం చెలించుకోవాల్సి వస్తుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న ఏదోకటి జరుగుతూనే ఉంటాయి. అందుకే ఈమధ్య మన స్టార్ హీరోస్ ఫంక్షన్స్ ఓపెన్ గ్రౌండ్ లో చేయడం ఆపేసారు. మళ్లీ చాలా కాలం తరువాత ప్రభాస్ సాహో ప్రీ రిలీజ్ వేడుక అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిపోయింది.

సెంటిమెంట్ పరంగా బాహుబలి ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎక్కడ జరిగిందో అక్కడే సాహో ఫంక్షన్ జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఈ వేడుక ను నిర్వహించారు చిత్ర యూనిట్. ఈ ఫంక్షన్ కి 50 వేల‌మంది పైనే వచ్చారని తెలుస్తుంది. వీరిని కంట్రోల్ చేయడంలో పోలీసులు సక్సెస్ అయ్యారు. బ‌హుశా చాలా కాలం త‌ర‌వాత ఇంతమంది జనాలు రావడం ఇదే మొదటిసారేమో?

ఫ్యాన్స్ కోసం సాహో సినిమాలో ఉప‌యోగించిన ఆయుధాలు, వాహ‌నాలు, ట్యాంక‌ర్లు అన్నీ ప్ర‌దర్శ‌న‌కు ఉంచారు. ఇంత పెద్ద ఈవెంట్ జరుగుతున్నప్పుడు చిల్ల‌ర‌మ‌ల్ల‌ర ఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. అలాంటివేం జ‌ర‌క్కుండా పోలీసు యాజ‌మాన్యం త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకుంది. సో ఫంక్షన్ చాలా కూల్ అయిపోయింది. అన్ని పనులు ముగించుకుని ఈమూవీ ఆగస్టు 30 న వరల్డ్ వైడ్ గా రిలీజ్ అవుతుంది.

Tags:    

Similar News