సాహో కి అంత సీన్ ఉందా?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సాహో మరో 11 రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతుంది. వరల్డ్ వైడ్ గా ఈమూవీ రిలీజ్ అవుతున్న [more]

Update: 2019-08-20 07:57 GMT

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ లేటెస్ట్ సెన్సేషన్ సాహో మరో 11 రోజుల్లో రిలీజ్ కి రెడీ అవుతుంది. వరల్డ్ వైడ్ గా ఈమూవీ రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇండియా లో 5 భాషల్లో ఈమూవీ రిలీజ్ కానుంది. తెలుగు తో పాటు తమిళం-మలయాళం-కన్నడం అలానే హిందీ లో రిలీజ్ అవ్వనుంది. దాదాపు 350 కోట్లు బడ్జెట్ తో తెరకెక్కిన ఈమూవీ థియేట్రికల్ రైట్స్ రూపంలోనే 320 కోట్లు, నాన్ థియేట్రికల్ శాటిలైట్ – డిజిటల్ రూపంలో 130 కోట్లు బిజినెస్ చేసింది. అంతే టోటల్ గా ఈమూవీ 450 కోట్ల మేర బిజినెస్ పూర్తి చేసుకుందని అర్ధం అవుతుంది. ఇక ఏ భాషలో సాహో ఎంత బిజినెస్ చేసిందో చూద్దాం..

థియేట్రికల్ బిజినెస్ వివరాలు:

తెలుగు వెర్షన్ 125 కోట్లు…
తమిళం-మలయాళం-కన్నడం కలిపుకుని 50 కోట్లు…
హిందీ – 120 కోట్లు…

శాటిలైట్- డిజిటల్ బిజినెస్ వివరాలు:

తెలుగు- తమిళం- మలయాళ భాషలు అన్ని కలుపుకుని 110కోట్లు బిజినెస్ చేసిందని టాక్. హిందీ వర్షన్ అయితే ఏకంగా 85 కోట్లకు డీల్ పూర్తి చేసుకుందని టాక్.

టోటల్ గా అన్ని కలుపుకుని 450 కోట్ల డీల్ తో ఈమూవీ రిలీజ్ అవుతుంది.ఈమూవీ సేఫ్ అవ్వాలంటే 350 కోట్ల షేర్ రాబట్టాలి. ప్రభాస్ కి ఉన్న క్రేజు దృష్ట్యా ఓపెనింగులు అదరిపోయే ఛాన్సుందని చెబుతున్నారు.

Tags:    

Similar News