సాహో హిట్ అయితే చూద్దామంటున్నారా?

ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం సాహో ఈ నెల 30 న విడుదల కాబోతుంది. ఇప్పటికే భారీగా [more]

Update: 2019-08-15 08:32 GMT

ప్రభాస్ – శ్రద్ద కపూర్ జంటగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ యాక్షన్ చిత్రం సాహో ఈ నెల 30 న విడుదల కాబోతుంది. ఇప్పటికే భారీగా ప్రమోషన్స్ స్టార్ట్ అయిన సాహో చిత్రం పై బరి అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సాహో ప్రీ రిలీజ్ బిజినెస్ ఆకాశాన్ని తాకే రేంజ్ లో జరిగింది. భారీ క్రేజ్ ఉన్న సాహో సినిమా లోని యాక్షన్ చూసి ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులు సైతం సాహో సినిమా విడుదల కోసం ఎంతగా వెయిట్ చేస్తున్నారో అనేది సాహో ట్రైలర్ హిందీ వ్యూస్ లోనే తెలుస్తుంది. సాహో లోని యాక్షన్ మోతాదు హాలీవుడ్ రేంజ్ లో అందరిని ఆకట్టుకుంటుంది.

అయితే ఇప్పుడు బాలీవుడ్ ప్రేక్షకులే కాదు.. సాహో చిత్ర విడుదల కోసం చాలామంది బాలీవుడ్ ప్రముఖులు కూడా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే సాహో సినిమా బాలీవుడ్ ఖాన్స్ రికార్డులను కొల్లగొట్టడం ఖాయమంటూ జాతీయ మీడియాలో న్యూస్ రావడంతో ఇప్పుడు బాలీవుడ్ మొత్తం సాహో విడుదల కోసం ఎదురు చూస్తుంది. తాజాగా మరో నిర్మాణ సంస్థ అయితే భారీ యాక్షన్ హంగులతో తెరకెక్కిన సాహో హిట్ అయితే గనక తామొక సినిమా హాలీవుడ్ రేంజ్ లో నిర్మించాలనుకున్నారట. బాలీవుడ్ లో ధూమ్ సీరీస్ కి ఒక రేంజ్, ఒక క్రేజ్ ఉంది. ధూమ్ సీరీస్ బాలీవుడ్ లో సూపర్ హిట్ అయిన సీరీస్. అయితే ధూమ్ 1, 2, 3 వరకు సూపర్ హిట్స్ అయిన ఈ ధూమ్ సీరీస్ లో ధూమ్ 4 కోసం ఎప్పటినుండో ప్రయత్నాలు మొదలెట్టారు. ధూమ్ 1 లో దొంగగా జాన్‌ అబ్రహాం నటించగా… ధూమ్ 2 లో దొంగగా హృతిక్‌ రోషన్, ధూమ్ 3 లో అమీర్ ఖాన్ నటించాడు. ఈ హిట్ సీరీస్ కి సీక్వెల్ ధూమ్ 4 కూడా కాస్త డిఫ్రెంట్ గా ప్రెజెంట్ చెయ్యాలనే తలంపుతో ఉన్నారు.

అయితే ధూమ్ 4 లో యంగ్ హీరోస్ ని పెట్టి.. కాస్త డిఫ్రెంట్ గా యాక్షన్ మోతాదు పెంచి… హాలీవుడ్ రేంజ్ లో నిర్మించాలని యష్‌రాజ్‌ ఫిలింస్‌ చూస్తుంది. అయితే ఇప్పుడు సాహో హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కడం ఆ చిత్రంపై బరి అంచనాలు ఉండడంతో.. ఆ సినిమా విడుదలై హిట్ కొడితే తమ సినిమాని కూడా ఆ రేంజ్ యాక్షన్ తో తియ్యాలని యష్‌రాజ్‌ ఫిలింస్‌ డిసైడ్ అయినట్లుగా తెలుస్తుంది. మరి సాహో గనక అనుకున్న రేంజ్ హిట్ అయితే బాలీవుడ్ మరో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడానికి యష్‌రాజ్‌ ఫిలింస్‌ రెడీ అవుతుంది…. లేదంటే అనేది సాహో సినిమానే తేల్చాలి.

Tags:    

Similar News