ఫైటర్ కోసం పూరి పాట్లు?

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఫైటర్ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. డిసెంబర్ నుండి [more]

Update: 2020-11-16 05:07 GMT

పూరి జగన్నాధ్ – విజయ్ దేవరకొండ కాంబోలో పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ఫైటర్ సినిమా షూటింగ్ ఇంకా మొదలు కాలేదు. డిసెంబర్ నుండి ఫైటర్ షెడ్యూల్ ని మొదలుపెటె యోచనలో పూరి – విజయ్ దేవరకొండ లు ఉన్నారు. ముంబై లోనే ఫైటర్ షూటింగ్ చెయ్యాలి.. కాబట్టి కరోనా తగ్గుముఖం పడుతున్న కారణముగా పూరి కొత్త షెడ్యూల్ కి ప్లాన్ చేస్తున్నాడు. అలాగే ఫైటర్ క్లైమాక్స్ కోసం పూరి జగన్నాధ్ ఓ ప్రత్యేకమైన సెట్ ని వేయిస్తున్నాడట. ఈ సెట్ వర్క్ ఫినిష్ కాగానే పూరి ఫైటర్ షూటింగ్ మొదలు పెడతాడా.

క్లైమాక్స్ షూటింగ్ కోసం వేసిన ఈ అండర్ గ్రౌండ్ డాన్ హౌస్ సెట్ ఫైటర్ కొత్త షెడ్యూల్ ప్రారంభమవుతుంది. విజయ్ దేవరకొండ డిసెంబర్ సెకండ్ వీక్ నుండి సెట్స్ మీదకి వెళదాం.. అందులో ముందు క్లయిమాక్స్ కి సంబందించిన సీన్స్ షాట్ చేస్తారట. మరి కరోనా కారణముగా ఆగిన షూటింగ్ అన్ని ఆగష్టు, సెప్టెంబర్ నుండి మొదలైన విజయ్ – పూరి లు తొందరపడకుండా డిసెంబర్ నుండి షూటింగ్ మొదలుపెడుతున్నారు. కరణ్ జోహార్ కూడా షూటింగ్ మొదలు పెట్టడానికి తొందర లేదు.. అంతా పక్కా అనుకున్నాకే మొదలెడదామని పూరీని సపోర్ట్ చెయ్యడంతో ఫైటర్ సినిమా ఆరామ్స్ గా సెట్స్ మీదకెళుతుంది.

Tags:    

Similar News