జక్కన్న కోసం దిగివచ్చిన తారలు!

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మావయ్య కాబోతున్నాడు. రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి జరగబోతుంది. ప్రముఖ నటుడు జగపతి బాబు అన్న కూతురు పూజా ప్రసాద్ తో రేపు [more]

Update: 2018-12-29 06:26 GMT

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ మావయ్య కాబోతున్నాడు. రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లి జరగబోతుంది. ప్రముఖ నటుడు జగపతి బాబు అన్న కూతురు పూజా ప్రసాద్ తో రేపు పెళ్లి జరగబోతుంది. రాజమౌళి కుటుంబం జగపతి బాబు కుటుంబం ఒక్కటి కాబోతుంది. రేపు వీరి పెళ్లి జైపూర్ లో గ్రాండ్ గా జరుగనుంది. ఈనేపధ్యంలో పలువురు సినీ ప్రముఖులు, సన్నిహితులు రాజస్తాన్ కు చేరుకుంటున్నారు.

వైరల్ అయి….

రెండు రోజులు ముందే ఎన్టీఆర్ .. రానా ..ప్రభాస్..అనుష్క..నాని వెళ్లడం విశేషం. ఈరోజు చాలామంది స్టార్స్ ఇక్కడ నుండి పెళ్లి కి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా అందరు అక్కడ పాటలకు స్టెప్స్ వేయడం…సరదాగా ఉండటం ఆ వీడియోస్ బయటికి రావడం చూశాం. ప్రస్తుతం ఈ వీడియోస్ అండ్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఎక్కడ చూసినా ఈ వీడియోలే కనిపిస్తున్నాయి.

ఒకే వేదికపై….

ఇక్కడ విషయం ఏంటంటే ప్రభాస్.. అనుష్కలతో పాటు రాజమౌళి కూడా డాన్స్ వేయడం. ఇక్కడినుండి వెళ్ళిన సెలెబ్రెటీస్ కి అక్కడ 7 స్టార్ హోటల్ లో అతిధి మర్యాదలు చేస్తున్నారట. ఈ వివాహ వేడుక జైపూర్ లో ఓ హోటల్ లో జరగనుంది. ఇలా టాలీవుడ్ సెలెబ్రెటీస్ మొత్తం ఒకే వేదికపైకి వచ్చి సరదాగా ఉండటం చూసి చాల ఏళ్ళు అయింది. ఫ్యాన్స్ కు ఇదొక పండగ. అందరిని ఒకే వేదికపైకి తీసుకుని రావడం జక్కన్న కె సాధ్యం.

Tags:    

Similar News