రెజినా – నివేత భయపెడతారట

పల్లెటూర్లలో భయపడే వారిని శాకినీ, ఢాకిని దెయ్యాల కథలతో భయపెట్టేస్తుంటారు. అసలు శాకినీ, ఢాకిని పిశాచాలు అంటే జుట్టు విరబోసుకుని, పెద్ద పెద్ద గోళ్లు పెంచుకుని భయంకరంగా [more]

Update: 2021-05-06 09:56 GMT

పల్లెటూర్లలో భయపడే వారిని శాకినీ, ఢాకిని దెయ్యాల కథలతో భయపెట్టేస్తుంటారు. అసలు శాకినీ, ఢాకిని పిశాచాలు అంటే జుట్టు విరబోసుకుని, పెద్ద పెద్ద గోళ్లు పెంచుకుని భయంకరంగా ఉంటారంటారు. కానీ ఇక్కడ ఈ పేరుతొ ఓ సినిమా తెరకెక్కుతుంది. అది కూడా సుధీర్ వర్మ దర్శకత్వంలో సురేష్ ప్రొడక్షన్ లో ఈ శాకినీ .. ఢాకిని సినిమా ఓ కొరియన్ మూవీకి రీమేక్ గా తెరకెక్కబోతుంది. మరి ఆ శాకినీ .. ఢాకిని లుగా ఏ హీరోయిన్స్ నటిస్తున్నారో తెలుసా.. శాకినీ గా రెజినా కనిపిస్తుంటే.. ఢాకిని గా నివేత థామస్ కనిపించబోతుంది.
ఈమధ్యన అవకాశాలు తగ్గి నెగెటివ్ రోల్స్, ఐటెం సాంగ్స్ వైపు కి మరలిన రెజినా, రీసెంట్ వకీల్ సాబ్ లో అద్భుతమైన నటన కనబర్చిన నివేత థామస్ లు ఇద్దరూ ట్రైనీ పోలీస్ ఆఫీసర్స్ గా ఈ శాకినీ .. ఢాకిని సినిమాలో కనిపించబోతున్నారు. ట్రైనీ పోలీస్ లుగా వీరు ఓ అమ్మాయి కిడ్నాప్ కేసుని ఛేదిస్తారనేది ఈ సినిమా కథగా ఉండబోతుందట. ఆ కిడ్నాప్ కేసుని ఛేదించే క్రమంలో రెజినా, నివేత థామస్ లు ఎలాంటి సమస్యలను ఎదుర్కున్నారనేది ఈ సినిమాలో దర్శకుడు సుధీర్ వర్మ చూపిస్తాడంటున్నారు. ఈ సినిమాలో రెజినా, నివేత ఫైట్స్ కూడా చేస్తారట. సైలెంట్ గా ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా.. కరోనా ఎఫెక్ట్ తగ్గగానే మరో షెడ్యూల్ మొదలు పెడతారని తెలుస్తుంది.

Tags:    

Similar News