#RRR హీరోయిన్ వీరే..!

గత ఐదు నెలలుగా #RRR హీరోయిన్స్ విషయంలో ఎడతెగని సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR సినిమాలో చరణ్ [more]

;

Update: 2019-03-14 08:00 GMT
#rrr movie update
  • whatsapp icon

గత ఐదు నెలలుగా #RRR హీరోయిన్స్ విషయంలో ఎడతెగని సస్పెన్స్ క్రియేట్ అయ్యింది. రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న #RRR సినిమాలో చరణ్ సరసన, ఎన్టీఆర్ సరసన నటించబోయే హీరోయిన్స్ విషయంలో మీడియా రోజుకో రెండు హీరోయిన్స్ పేర్లను తెరమీదకి తెచ్చింది. సోషల్ మీడియాలో అయితే #RRR లో నటించబోయే హీరోయిన్స్ వీళ్లే అంటూ ప్రియాంక చోప్రా, దీపికా పదుకొనే, కీర్తి సురేష్, రకుల్, రాశీ ఖన్నా, రష్మిక, పరిణితి, అలియా భట్ ఇలా చాలా పెద్ద లిస్ట్ నడిచింది.

తారక్ సరసన హాలీవుడ్ హీరోయిన్

అయితే తాజాగా #RRR ప్రెస్ మీట్ లో రాజమౌళీ.. ఈ సినిమాలో కీలక పాత్రలు చెయ్యబోతున్న పేర్లను రివీల్ చేసాడు. #RRR లో చరణ్ అల్లూరి సీత రామరాజుగా కనిపిస్తాడని. అలాగే చరణ్ సరసన ముందునుంచీ ప్రచారంలో ఉన్న అలియా బట్ హీరోయిన్ గా నటిస్తుందని చెప్పారు. ఇక ఎన్టీఆర్ కొమరం భీంగా కనిపిస్తాడని.. ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గార్ జోన్స్ నటిస్తుందని చెప్పిన రాజమౌళి.. ఇంకా ముఖ్యమైన పాత్రల్లో అజయ్ దేవగన్, సముద్రఖని నటిస్తున్నారని చెప్పాడు.

Tags:    

Similar News