Virupaksha : ఓటీటీలోకి విరూపాక్ష ఎంట్రీ

థియేటర్లలో అందరినీ భయపెట్టిన ఈ సినిమాకు కాసుల వర్షం కురిసింది. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన విరూపాక్ష ఇప్పటివరకూ;

Update: 2023-05-16 12:05 GMT
virupaksha ott release, virupaksha collections

virupaksha ott release

  • whatsapp icon

మెగా సుప్రీమ్ హీరో సాయిధరమ్ తేజ్ చాలా గ్యాప్ తర్వాత ఆడియన్స్ ముందుకి విరూపాక్షగా వచ్చి.. బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు. మిస్టిక్ హార్రర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్ గా నటించగా.. రాజీవ్ కనకాల, రవికృష్ణ, సోనియా సింగ్, శ్యామల కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు కార్తీక్ దండు దర్శకత్వం వహించగా.. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ స్క్రీన్ ప్లే అందించాడు. ముందుగా తెలుగులో విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో.. హిందీ, తమిళ్, మలయాళ భాషల్లో కూడా విడుదల చేశారు.

థియేటర్లలో అందరినీ భయపెట్టిన ఈ సినిమాకు కాసుల వర్షం కురిసింది. ఏప్రిల్ 21న థియేటర్లలో విడుదలైన విరూపాక్ష ఇప్పటివరకూ రూ.91 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది. మరో వారంలో రూ.100 కోట్ల మార్క్ ను అందుకుంటుందని ట్రేడ్ వర్గాల అంచనా. థియేటర్లలో భయపెట్టిన విరూపాక్ష ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. నెట్‌ఫ్లిక్స్ లో మే 21 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కు రానుంది.
విరూపాక్ష తర్వాత సాయి ధరమ్ తేజ్ నటిస్తోన్న సినిమా వినోదయ సిత్తం రీమేక్. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. PKSDT అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ పూర్తయింది. ఈ సినిమాకు ‘BRO’ అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాపై అధికారిక ప్రకటన రానుంది.


Tags:    

Similar News