అఖిల్ కి బర్త్ డే విషెస్ చెప్పిన సమంత

అఖిల్ నటిస్తోన్న ఏజెంట్ సినిమా పోస్టర్ ని సమంత తన ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేస్తూ..హ్యాపీ బర్త్ డే అఖిల్. ఎంతో ప్రేమతో..

Update: 2023-04-08 12:28 GMT

samantha birthday wishes to akhil akkineni

సమంత, నాగచైతన్య విడిపోయి ఏడాదిన్నర కాలం కావస్తోంది. విడాకుల తర్వాత కూడా సమంత అక్కినేని కుటుంబంతో టచ్ లో ఉంటోంది. అక్కినేని హీరోలైన అఖిల్, సుశాంత సినిమాలు, పోస్టులపై సమంత స్పందిస్తుంటుంది. తాజాగా నేడు (ఏప్రిల్ 8) అక్కినేని అఖిల్ పుట్టినరోజు కావడంతో.. సెలబ్రిటీలంతా అతనికి విషెస్ చెబుతున్నారు. ఈ క్రమంలోనే సమంత కూడా సోషల్ మీడియా ద్వారా అఖిల్ కు విషెస్ తెలిపింది.

అఖిల్ నటిస్తోన్న ఏజెంట్ సినిమా పోస్టర్ ని సమంత తన ఇన్ స్టా స్టోరీస్ లో షేర్ చేస్తూ..హ్యాపీ బర్త్ డే అఖిల్. ఎంతో ప్రేమతో. ఏజెంట్ కోసం ఎదురు చూస్తున్నా అని పేర్కొంది. తన మాజీ వదిన విషెస్ పై అఖిల్ స్పందించాడో లేదో తెలీదు గానీ.. సమంత అఖిల్ కు విషెస్ చెప్పడంతో నెటిజన్లు సంతోషం వ్యక్తం చేశారు. అలాగే అల్లు అర్జున్ పుట్టినరోజు కూడా ఇవాళే కావడంతో బన్నీకి కూడా విషెస్ తెలియజేసింది. చాలా కొంతమందే నన్ను ఇన్‌స్పైర్ చేస్తారు. అందులో నువ్వు ఒకడివి అంటూ అల్లు అర్జున్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. కాగా.. సమంత నటించిన శాకుంతలం సినిమా ఈ నెల 14న థియేటర్లలో విడుదల కానుంది.


Tags:    

Similar News