రెండోపెళ్లి చేసుకోబోతున్న సమంత.. నిజమా ? రూమర్సా ?

గతేడాది అక్టోబర్ నెలలో సమంత- చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొన్నాళ్లకి చైతన్య..;

Update: 2022-09-24 11:11 GMT
రెండోపెళ్లి చేసుకోబోతున్న సమంత.. నిజమా ? రూమర్సా ?
  • whatsapp icon

టాలీవుడ్ హీరోయిన్, నాగచైతన్య మాజీ భార్య సమంత రెండో పెళ్లికి సిద్ధమైందంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఏం మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులతో పాటు.. చైతన్యని కూడా మాయచేసిందీ అమ్మడు. మొదట స్నేహితులుగా, ఆ తర్వాత అది ప్రేమగా మారి ఇరు కుటుంబాలను ఒప్పించి.. రెండు పద్ధతుల్లో పెళ్లి కూడా చేసుకున్నారు. కానీ.. ఆ బంధం ఎక్కువకాలం నిలవలేదు.

గతేడాది అక్టోబర్ నెలలో సమంత- చైతన్య విడాకులు తీసుకుంటున్నట్లు అధికారికంగా ప్రకటించారు. కొన్నాళ్లకి చైతన్య ఓ నటితో ప్రేమలో ఉన్నాడని, త్వరలోనే రెండోపెళ్లి చేసుకుంటాడని పుకార్లొచ్చాయి. అది నిజమా కాదా అని తెలియకుండానే ఆ ప్రచారం ముగిసింది. తాజాగా సమంత రెండోపెళ్లికి రెడీ అయిందంటూ మరో ప్రచారం తెరపైకొచ్చింది. సాధారణంగా ఈషా ఫౌండేషన్ నిర్వహించే మహాశివరాత్రి వేడుకలలో సమంత తన స్నేహితులతో కలిసి ప్రతి ఏడాది పాల్గొంటూ ఉంటుంది. ఆమెకు జగ్గీ వాసుదేవ్ తో మంచి పరిచయం ఉంది. సమంత మొదటి పెళ్లి పెటాకులయి ఇబ్బంది పడుతున్న సమయంలో.. ఆమె బాగా విశ్వసించే ఆధ్యాత్మిక గురువు జగ్గీ వాసుదేవ్ ఆధ్యాత్మికంగా కొన్ని మంచి విషయాలు చెప్పి ప్రేరేపించారని, దీంతో సమంతకు రెండో వివాహం చేసుకోవాలని కూడా ఆయనే సలహా ఇచ్చారనే ప్రచారం జరుగుతోంది.
దీనికన్నా ముందు సమంత నెలరోజులపైగా సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో ఆమె ప్రెగ్నెంట్ అని, ఆమె అబార్షన్ చేయించుకుందన్న ప్రచారం కూడా జరగ్గా.. దానిని సమంత మేనేజర్ ఖండించారు. అలాంటిదేమీ లేదని, ఆమె ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేశారు. రెండోపెళ్లి ప్రచారంపై ఇంకా ఎలాంటి స్పందన లేకపోవడంతో అది నిజమే అయి ఉంటుందని భావిస్తున్నారు. దీనిపై సమంత స్పందిస్తుందో లేదో చూడాలి. కాగా.. ప్రస్తుతం సమంత చేతిలో యశోద, ఖుషి ప్రాజెక్టులున్నాయి. ఆమె నటించిన శాకుంతలం సినిమా నవంబర్ 4న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.


Tags:    

Similar News