అరుదైన గౌరవం అందుకున్న సూర్య

సినిమా ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా ఆస్కార్‌ను పరిగణిస్తారు. ఏటా వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డులు ఉంటాయి.

Update: 2022-06-29 11:27 GMT

సినిమా ప్రపంచంలోనే అత్యున్నత పురస్కారంగా ఆస్కార్‌ను పరిగణిస్తారు. ఏటా వివిధ విభాగాల్లో ఆస్కార్ అవార్డులు ఉంటాయి. అవార్డుల వేడుకలో పాల్గొనే చిత్రాలపై ఆస్కార్ కమిటీ సభ్యులు ఓటు వేస్తారు. ఎక్కువ ఓట్లు వచ్చిన సినిమాకి లేదా నటుడు లేదా నటికి లేదా టెక్నీషియన్ కు అవార్డు ఇవ్వబడుతుంది. ఆస్కార్ కమిటీ సభ్యుల వివరాలు ప్రతి సంవత్సరానికి మారుతూ ఉంటాయి. ఈ జాబితాలో ప్రపంచవ్యాప్తంగా అనేక మంది ప్రముఖులు ఉన్నారు. అకాడమీ బోర్డు ఆ సంవత్సరానికి 397 మంది కమిటీ సభ్యుల జాబితాను అధికారికంగా విడుదల చేసింది.

అందులో కోలీవుడ్‌ ప్రముఖ నటుడు సూర్యకు అరుదైన గౌరవం దక్కనుంది. 2022 ఆస్కార్‌ అవార్డుల వేడుకల్లో పాల్గొనాలని సూర్యకు ఆహ్వానం అందింది. ఈ ఆహ్వానం పొందిన తొలి దక్షిణ భారత నటుడు సూర్య కావడం విశేషం. సూర్యతో పాటు బాలీవుడ్‌ నటి కాజోల్‌కు, దర్శకురాలు రీమా కగ్తీకి కూడా ఆస్కార్‌ అకాడమీ నుండి ఆహ్వానాలు అందాయి. తాజాగా సూర్య‌కు అకాడ‌మీ ఆఫ్ మోష‌న్ పిక్చ‌ర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్(ఆస్కార్ 2022) నుండి ఆహ్వానం వ‌చ్చింది. ప్ర‌పంచ వ్యాప్తంగా 397మంది కార్యనిర్వాహకుల జాబితాను అకాడమీ విడుదల చేసింది. అందులో సూర్య పేరు కూడా ఉంది. ఇటీవల ఉత్తమ డాక్యుమెంటరీ ఫీచర్‌ విభాగంలో నామినేట్‌ అయిన 'రైటింగ్‌ విత్‌ ఫైర్‌' నిర్మాతలు రింటు థామస్‌, సుస్మితా ఘోష్‌లకు కూడా హాజరుకాబోతున్నారు. సూర్య న‌టించిన 'ఆకాశం నీ హ‌ద్దురా', 'జై భీమ్' చిత్రాలు ఆస్కార్ వ‌ర‌కు వెళ్లి వెన‌క్కి తిరిగి వ‌చ్చిన విష‌యం తెలిసిందే. నటుడు సూర్య ఆస్కార్‌కి ఎంపిక కావడం ఇదే తొలిసారి. ఆస్కార్‌కి ఎంపికైన తొలి దక్షిణాది నటుడుగా సూర్య నిలిచాడు.


Tags:    

Similar News