Dil Raju : సంక్రాంతి రిలీజ్‌లు పై దిల్‌రాజు కామెంట్స్.. గుంటూరు కారం..

సంక్రాంతి రిలీజ్‌ల ఇష్యూ పై దిల్‌రాజు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గుంటూరు కారం పోస్టుపోన్ చేయడం..;

Update: 2023-12-25 15:01 GMT
Dil Raju, 2024 sankranti movies, Eagle, Family Star, Guntur Kaaram, Saindhav, Hanuman, movie news

2024 sankranti movies

  • whatsapp icon

Dil Raju : 2024 సంక్రాంతి బరిలో నిలిచేందుకు.. ఈసారి టాలీవుడ్ మేకర్స్ లో గట్టి పోటీ కనిపిస్తుంది. దాదాపు అరడజను సినిమాలను సంక్రాంతికి తీసుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. మహేష్ బాబు ‘గుంటూరు కారం’, వెంకటేష్ ‘సైంధవ్‌’, నాగార్జున ‘నా సామిరంగ’, రవితేజ ‘ఈగల్’, విజ‌య్ దేవ‌ర‌కొండ ‘ఫ్యామిలీ స్టార్’, తేజ సజ్జా ‘హనుమాన్’.. సినిమాలు పొంగల్‌కి రాబోతున్నట్లు ప్రకటించారు. వీటితో పాటు డబ్బింగ్ సినిమాల రిలీజ్‌లు కూడా ఉన్నాయి. అయితే ఇన్ని మూవీస్‌కి థియేటర్స్ సర్దుబాటు చేయాలంటే కష్టమవుతుంది.

దీంతో ఒక మూడు సినిమాలను అయినా వెనక్కి వెళ్తే అందరికి మంచిందని.. ఇటీవల దిల్ రాజు నాయకత్వంలో ఒక మీటింగ్ జరిగింది. ఇక ఈ నిర్ణయం పై ముందడుగు దిల్ రాజే తీసుకుంటూ.. తను నిర్మిస్తున్న 'ఫ్యామిలీ స్టార్'ని సమ్మర్‌కి పోస్టుపోన్ చేసినట్లు రీసెంట్ ప్రెస్ మీట్ లో తెలియజేసారు. ఇక మిగిలిన చిత్రాల్లో 'గుంటూరు కారం' అందరికంటే ముందుగా డేట్‌ని ప్రకటించింది కాబట్టి దానిని పోస్టుపోన్ చేయడం అనేది జరగదు అని తేల్చి చెప్పేసారు.
ఇక మిగిలిన నాలుగు సినిమాల్లో వెంకటేష్ ‘సైంధవ్‌’ డిసెంబర్ లోనే రిలీజ్ కావల్సి ఉంది. కానీ సలార్ వల్ల అది జనవరికి వచ్చింది. కాబట్టి వారినీ వెనక్కి వెళ్లలేము అన్నట్లే దిల్ రాజు మాట్లాడారు. ఇక మిగిలిన మూడు సినిమాలు ‘నా సామిరంగ’, ‘ఈగల్’, ‘హనుమాన్’లో.. ఎవరో ఒకరు వెనక్కి తగ్గితే ఈ సమస్య తీరిపోతుంది. ఈ రెండు రోజుల్లో దీని పై ఒక క్లారిటీ వచ్చేస్తుంది.
తమ సినిమాని వాయిదా వేసుకోవడానికి సిద్ధపడిన సినిమాకి.. ఒక సోలో డేట్ వచ్చేలా తాము చూసుకుంటామని దిల్ రాజు తెలియజేసారు. అయితే దిల్ రాజు ఈ ప్రెస్ మీట్ లో మరో మాట కూడా మాట్లాడారు. ఆడియన్స్ కి ఫస్ట్ ఛాయస్ పెద్ద సినిమానే ఉంటుంది. కాబట్టి చిన్న సినిమాకి కష్టమే అవుతుందని చెప్పారు. ఈ వ్యాఖ్యలు బట్టి చూస్తే.. హనుమాన్ సినిమా పోస్టుపోన్ అయ్యేలా కనిపిస్తుంది.


Full View


Tags:    

Similar News