చెన్నై లో టాప్ 5 తెలుగు చిత్రాలు
‘బాహుబలి’ పుణ్యమా అని మన తెలుగు సినిమా స్థాయే మారిపోయింది. తెలుగు లో ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే అన్ని భాషల వారు ఆ సినిమా వైపు [more]
‘బాహుబలి’ పుణ్యమా అని మన తెలుగు సినిమా స్థాయే మారిపోయింది. తెలుగు లో ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే అన్ని భాషల వారు ఆ సినిమా వైపు [more]
‘బాహుబలి’ పుణ్యమా అని మన తెలుగు సినిమా స్థాయే మారిపోయింది. తెలుగు లో ఏదన్నా సినిమా రిలీజ్ అవుతుంటే అన్ని భాషల వారు ఆ సినిమా వైపు చూస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా మన సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ముఖ్యంగా మన పక్క రాష్ట్రము అయినా తమిళనాడు లో మన మూవీస్ రిలీజ్ అయ్యి మంచి వసూల్ చేస్తాయి.
ఈనేపధ్యంలో చెన్నై సిటీ లో 2018 లో టాప్ 5 తెలుగు సినిమాలు ఎంత కలెక్ట్ చేశాయో చూద్దాం. మహేష్ బాబు ‘స్పైడర్’ సినిమా ఇక్కడే కాదు అక్కడ కూడా డిజాస్టర్ అయినప్పటికీ మహేష్ సినిమాలని అక్కడ రిలీజ్ చేస్తున్నారు. ‘స్పైడర్’ తరువాత కొరటాల శివ డైరెక్షన్ లో వచ్చిన ‘భరత్ అనే నేను’ అక్కడ 2018 లో టాప్ 5 లో మొదటి ప్లేస్ దక్కించుకుంది. రెండో స్థానం లో విజయ్ ‘గీత గోవిందం’ ఉంది.. మూడో స్థానం ‘రంగస్థలం’..నాలుగు ‘మహానటి’…యైదు ‘అరవింద సమేత’ ఉన్నాయి. టాప్ 5 వివరాలు మీకోసం
1 భరత్ అనే నేను – 1.72 Cr
2 గీత గోవిందం – 1.40 Cr
3 రంగస్థలం – 1.25 Cr
4 మహానటి – 1.05 Cr
5 అరవింద సమేత – 0.75 Cr