వకీల్ సాబ్ డైరెక్టర్ కి ఎంత ఎలివేషన్!
పింక్ సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారు అనగానే అందరిలో ఆశ్చర్యం, అందులోను వేణు శ్రీరామ్ డైరెక్టర్ అనగానే.. పవన్ ఫాన్స్ కి అనుమానం. కానీ పింక్ [more]
పింక్ సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారు అనగానే అందరిలో ఆశ్చర్యం, అందులోను వేణు శ్రీరామ్ డైరెక్టర్ అనగానే.. పవన్ ఫాన్స్ కి అనుమానం. కానీ పింక్ [more]
పింక్ సినిమాని పవన్ కళ్యాణ్ రీమేక్ చేస్తున్నారు అనగానే అందరిలో ఆశ్చర్యం, అందులోను వేణు శ్రీరామ్ డైరెక్టర్ అనగానే.. పవన్ ఫాన్స్ కి అనుమానం. కానీ పింక్ లాంటి ఒక హాఫ్ బీట్ సినిమాని తీసుకొచ్చి పవర్ స్టార్ లాంటి హ్యుజ్ స్టార్ కి అడాప్ట్ చేసి, కరెక్ట్ కమర్షియల్ ఎలిమెంట్స్ పెట్టి.. ఫాన్స్ కి కావాల్సినవన్నీ ఇంక్లూడ్ చేసి పవన్ కళ్యాణ్ ని కరెక్ట్ గా పోట్రైట్ చేసినందుకు దర్శకుడు వేణు శ్రీరామ్ విషయంలో పవన్ ఫాన్స్ కి హ్యాపీనెస్ మాములుగా లేదు.
వకీల్ సాబ్ లో హీరోయిజం ఎక్కువైంది అనే విమర్శలు చేసినా.. పవన్ కళ్యాణ్ మూడేళ్ళ తర్వాత మళ్ళీ సినిమాల్లోకి కం బ్యాక్ ఇవ్వడం.. రాజకీయాల నుండి డైరెక్ట్ గా వకీల్ సాబ్ సినిమాకి ఎంట్రీ ఇచ్చేసినా.. దర్శకుడు వేణు శ్రీరామ్ పవన్ ఫాన్స్ మెచ్చేలా ఆయన్ని బిగ్ స్క్రీన్ మీద చూపించారు. సెలబ్రిటీస్ సైతం వకీల్ సాబ్ ని చూసి మెచ్చుకున్నారు. థియేటర్స్ లో ఎక్కువ రోజులు చూసే ఛాన్స్ లేకపోయినా.. ఓటిటిలో వకీల్ సాబ్ ని విపరీతంగా వీక్షిస్తున్నారు ప్రేక్షకులు. థియేటర్స్ లోనే కాదు.. ఓటిటిలో విడుదలైన వకీల్ సాబ్ గురించిన ముచ్చట్లు సోషల్ మీడియాలో ఇంకా ఇంకా వినిపిస్తూనే ఉంది. అందుకు వేణు శ్రీరామ్ కి పవన్ ఫాన్స్ కృతఙ్ఞతలు చెప్పేస్తున్నారు. వకీల్ సాబ్ తో తమకి, తమ హీరోకి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన దర్శకుడు వేణు శ్రీరామ్ ని నెత్తి పెట్టుకుంటున్నారు.
గబ్బర్ సింగ్ లాంటి హిట్ ఇచ్చిన తర్వాత హరీష్ శంకర్ కి ఎలాంటి రిసెప్షన్ దక్కిందో.. ఇప్పుడు మళ్ళీ అలాంటి వెల్ కం వేణు శ్రీరామ్ కి దక్కింది. పవన్ కళ్యాణ్ ఫాన్స్ పెట్టే మెసేజెస్ ని, వారి నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ ని వకీల్ సాబ్ హిట్ తర్వాత వేణు శ్రీరామ్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. రేపు వేణు శ్రీరామ్ పుట్టిన రోజు కావడంతో పవన్ కళ్యాణ్ ఫాన్స్ ఈ రోజే వేణు శ్రీరామ్ ని ఇండియా వైడ్ గా ట్రేండింగ్ లో ఉంచారు. #HBDMassGodVenuSriram అనే హాష్ టాగ్ ప్రస్తుతం ట్విట్టర్ లో టాప్ ట్రేండింగ్ లో ఉంది అంటే.. పవన్ ఫాన్స్ వేణు శ్రీరామ్ ని ఎంతగా లైక్ చేస్తున్నారో, ఎంతగా ఎత్తేస్తున్నారో అర్ధమవుతుంది.