వెంకిమామ టార్గెట్… మరీ ఇంత చిన్నదా?
వెంకటేష్ – నాగ చైతన్య కాంబో మీద భారీ అంచనాలున్నాయి. రియల్ మామ అల్లుళ్ళు రీల్ మామా అల్లుళ్లుగా ఎలా ఉంటారో అనే క్యూరియాసిటీ తో వెంకిమామ [more]
వెంకటేష్ – నాగ చైతన్య కాంబో మీద భారీ అంచనాలున్నాయి. రియల్ మామ అల్లుళ్ళు రీల్ మామా అల్లుళ్లుగా ఎలా ఉంటారో అనే క్యూరియాసిటీ తో వెంకిమామ [more]
వెంకటేష్ – నాగ చైతన్య కాంబో మీద భారీ అంచనాలున్నాయి. రియల్ మామ అల్లుళ్ళు రీల్ మామా అల్లుళ్లుగా ఎలా ఉంటారో అనే క్యూరియాసిటీ తో వెంకిమామ మీద ప్రేక్షకుల్లో పిచ్చ ఆసక్తి ఉంది. నిన్న మొన్నటివరకు డేట్ విషయంలో కాస్త అసంతృప్తిగా ఉన్న ఫ్యాన్స్ కూడా.. ఇప్పుడు వెంకిమామ ప్రమోషన్స్ హడావుడితో అన్ని మర్చిపోయారు. సురేష్ బాబు నిర్మాతగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన వెంకిమామ బడ్జెట్ పరిధి దాటింది అనే ప్రచారం జరిగింది. అయితే తాజాగా వెంకిమామ బడ్జెట్ 30 కోట్లే అని, సినిమా బడ్జెట్, ప్రమోషన్స్ బడ్జెట్ కలిపి 30 లోపే అయ్యిందని అంటున్నారు.
అయితే వెంకిమామ బిజినెస్ కూడా అనుకున్న రేంజ్ లోనే జరిగింది అని రెండు తెలుగు రాష్ట్రాలకే 27 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితేక ఓవర్సీస్ లో 2.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగితే.. మిగతా ఏరియా లనుండి కూడా 2.5 కోట్ల బిజినెస్ తో వెంకిమామ మొత్తంగా 32 కోట్లకు చేరింది అని టాక్ వినబడుతుంది. మరీ వెంకిమామ టార్గెట్ చూస్తే చాలా చిన్నదిగా అనిపిస్తుంది. ఎందుకంటే వెంకటేష్ ఎఫ్ 2 తోను నాగ చైతన్య మజిలీ హిట్స్ తో ఉండడంతో.. ఇద్దరు కలిసి నటించిన సినిమా కావడంతో వెంకిమామ అంచనాలను ఈజీగా అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాల అంచనా వేస్తున్నాయి. సురేష్ బాబు వెంకిమామ ని టేబుల్ ప్రాఫిట్ మీద విడుదల చేస్తున్నట్టుగా దీనిబట్టి అర్ధమవుతుంది