విద్యా బాలన్ మనసులో మాట..!

మరి కొన్నిరోజుల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రిలీజ్ అవుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తే… ఎన్టీఆర్ భార్య బసవతారకం [more]

Update: 2019-01-03 06:32 GMT

మరి కొన్నిరోజుల్లో ‘ఎన్టీఆర్ కథానాయకుడు’ రిలీజ్ అవుతుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ గా బాలకృష్ణ నటిస్తే… ఎన్టీఆర్ భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్య బాలన్ నటించింది. టాలీవుడ్ లో ఆమెకి ఇదే తొలి చిత్రం కావడం విశేషం. త్వరలో రిలీజ్ అవుతున్న ఈ సినిమాపై హోప్స్ పెట్టుకున్న విద్యా బాలన్ ఈ సినిమా ప్రమోషన్స్ లో పాల్గొంది. ఈ సందర్భంగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన మనసులో మాట బయట పెట్టింది.

రాజమౌళి సినిమాలో నటించాలని…

‘‘టాలీవుడ్ లో ఇది తన మొదటి సినిమా… ఇంతకంటే టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వడానికి మంచి సినిమా ఉండదేమో. అలానే దర్శకధీరుడు రాజమౌళి సినిమాలో తనకు నటించాలని ఉందని తన మనసులో మాట బయట పెట్టింది. రాజమౌళి తో కలసి పని చేయాలని ఏ నటి, నటుడికైనా ఉంటుంది. అలానే నాకు కూడా ఉంది. త్వరలోనే రాజమౌళి దర్శకత్వంలో నటించాలని ఉంది’’ అని చెప్పింది. ప్రస్తుతం #RRR సినిమాతో బిజీగా ఉన్న జక్కన్న విద్యా బాలన్ కోరికను నిజం చేస్తాడో లేదో చూడాలి. #RRR నెక్స్ట్ షెడ్యూల్ ఈనెల 19 నుండి స్టార్ట్ కానుంది.

Tags:    

Similar News