విరాటపర్వం అప్ డేట్.. "ద వాయిస్ ఆఫ్ రవన్న" వీడియో విడుదల

విరాటపర్వం సినిమా 2021 ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది.;

Update: 2021-12-14 07:09 GMT
virataparvam, rana daggubati, voice of ravanna, sai pallavi
  • whatsapp icon

బాహుబలి సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్న నటుల్లో రానా దగ్గుబాటి ఒకరు. ఆ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో భల్లాలదేవుడిగా రానా కనబరిచిన నటన అందరినీ ఆకట్టుకుంది. రానా గురించి ఒక్కమాటలో చెప్పాలంటే.. బాహుబలి ముందు.. బాహుబలి తర్వాత అనే చెప్పాలి. బాహుబలి తర్వాత రానా కెరీరే మారిపోయింది. వరుసగా వచ్చిన ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయాడు మన దగ్గుబాటి హీరో. అరణ్య, విరాటపర్వం, భీమ్లానాయక్ ఇలా వరుసగా సినిమా ఆఫర్లొచ్చాయి. వీటిలో అరణ్య ఇప్పటికే విడుదల కాగా.. విరాటపర్వం, భీమ్లా నాయక్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

ద వాయిస్ ఆఫ్ రవన్న.....
భీమ్లా నాయక్ రిలీజ్ డేట్ ఆల్రెడీ ఫిక్స్ అయింది. విరాటపర్వం విషయానికొస్తే.. ఈ సినిమా 2021 ఏప్రిల్ లోనే విడుదల కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. నేడు రానా పుట్టినరోజు సందర్భంగా విరాటపర్వం చిత్రయూనిట్ "ద వాయిస్ ఆఫ్ రవన్న" పేరుతో ఒక వీడియోను విడుదల చేసింది. ఈ వీడియోలో రానా లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. మావోయిస్ట్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న ఈ సినిమాలో రానా సరసన సాయిపల్లవి కథానాయికగా నటిస్తోంది. వేణు ఊడుగుల దర్శకత్వం వహిస్తున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో నిర్మాణం జరుపుకుంటున్న ఈ సినిమాలో ప్రియమణి, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.


Tags:    

Similar News