తమన్నా ని మోసం చేసింది ఎవరు?
హీరోయిన్స్ అంటే సెలబ్రిటీస్. వాళ్లకు కొన్ని అలవాట్లు ఉంటాయి. కానీ అభిమానుల నుండి సెలబ్రిటీస్ కి ప్రయివేసి ఉండదు. వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో జరుగుతుందో అనేది [more]
హీరోయిన్స్ అంటే సెలబ్రిటీస్. వాళ్లకు కొన్ని అలవాట్లు ఉంటాయి. కానీ అభిమానుల నుండి సెలబ్రిటీస్ కి ప్రయివేసి ఉండదు. వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో జరుగుతుందో అనేది [more]
హీరోయిన్స్ అంటే సెలబ్రిటీస్. వాళ్లకు కొన్ని అలవాట్లు ఉంటాయి. కానీ అభిమానుల నుండి సెలబ్రిటీస్ కి ప్రయివేసి ఉండదు. వాళ్ళ జీవితంలో ఏం జరిగిందో జరుగుతుందో అనేది వాళ్ళకి కావాలి. ఇక వాళ్ళకీ హృదయం ఉంటుంది, మేమేమి బొమ్మలు కాదు అంటూ చాలామంది హీరోయిన్స్ ఫైర్ అవుతుంటారు. తాజాగా తమన్నా, సమంత సామ్ జామ్ షోలో చాలా విషయాలను పంచుకుంది. విజయ్ దేవరకొండ హీరో అయితే రూల్స్ మొత్తం పక్కనపడేసి ముద్దు సీన్స్ కి సై అంటానంటూ సంచలనంగా మాట్లాడిన తమన్నాని సమంత ఓ ప్రశ్న అడిగింది. తమన్నా మీ ఇన్స్టా లో మీరు కాఫీ ని ఇష్టపడతారు. అలాగే కవి, నటి అని ఉంది. మీరు కవితలు కూడా రాస్తారా. నాకసలు ఇప్పటివరకు తెలియదే అని అడిగిన సమంత కి తమన్నా షాకింగ్ సమాధానమే ఇచ్చింది.
తమన్నా హృదయం బద్దలైనప్పుడే తాను కవిగా మారానని చెబుతుంది. ఎప్పుడైతే మన హృదయం బద్దలవుతుందో అప్పుడు మనం కవితలు కూడా రాస్తాం. ఈ విషయం నీకు కూడా తెలుసు అంటూ.. సమంత గతాన్ని కెలికేసింది. మన హృదయం ముక్కలయినప్పుడే మనం కవితలు రాస్తూ కవిగా మారతాం. ఈ సమాజంలో చాలామంది ఎదుటి వారి హృదయాలను ముక్కలు చేసే మనుషులు ఉంటారు అని తమన్నా అనగానే.. తమన్నా గుండె బద్దలు కొట్టిన ఆ మనిషి ఎవరు? వెంటనే కనిపెట్టాలంటూ కామెడీ చేసింది సమంత.