యువరాజ్ సింగ్ తండ్రి రజినీతో తలపడనున్నాడు

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మురగదాస్ డైరెక్షన్ లో ‘దర్బార్’ అనే చిత్రం చేస్తున్నాడు. దాదాపు సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమా పై [more]

Update: 2019-07-04 09:37 GMT

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం టాలెంటెడ్ డైరెక్టర్ మురగదాస్ డైరెక్షన్ లో ‘దర్బార్’ అనే చిత్రం చేస్తున్నాడు. దాదాపు సగం షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈసినిమా పై వరల్డ్ వైడ్ గా భారీ అంచనాలు ఉన్నాయి. కాగా ఈమూవీ లో ఓ కీలక పాత్ర క్రికెటర్ యువరాజ్ సింగ్ తండ్రి ‘యోగ్‌ రాజ్ సింగ్’ నటిసున్నారు.

సెకండ్ హాఫ్ లో ఈయన ఎంట్రీ ఉండనుంది. సెకండ్ హాఫ్ లో వచ్చే భారీ ఫైట్ సీక్వెన్స్ లో యోగ్‌ రాజ్, రజినితో కలిసి ఫైట్ చేయనున్నారట. ఆల్రెడీ ఆ సన్నివేశాలను షూట్ చేశారు. ఇక యోగ్‌రాజ్ కూడా క్రికెటరే. తన క్రికెటర్ కెరీర్ ముగిసాకా సినిమాల్లో నటిస్తున్నాడు. ఇతను బాలీవుడ్ లో చాలా సినిమాల్లో నటించారు. రజిని ఈచిత్రంలో కూడా ఫుల్ ఎనర్జీ తో కనిపించనున్నాడు. రజిని సరసన నయనతార నటిస్తుంది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం సినిమాకి హైలైట్ గా నిలవనుంది. ఒక ముఖ్య పాత్ర నివేత థామస్ నటిస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఈచిత్రం ని రిలీజ్ చేయాలనీ చూస్తున్నారు

Tags:    

Similar News