అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్ స్ట్రెచ్ నిర్మాణం

ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్ స్ట్రెచ్ నిర్మాణం..అతి తక్కువ సమయంలో

Update: 2022-06-08 12:03 GMT

అతి తక్కువ సమయంలో ప్రపంచంలోనే అతి పొడవైన రోడ్ స్ట్రెచ్ ను నిర్మించి భారత్ గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లోకి ఎక్కింది. ఈ విషయాన్ని కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI), రాజ్ పథ్ ఇన్ ఫ్రాకాన్ ప్రైవేట్ లిమిటెడ్, జగదీశ్ కదమ్ లు కలిసి 53వ నంబర్ జాతీయ రహదారిపై 75 కిలోమీటర్ల పొడవునా ఏకధాటిగా సింగిల్ లైన్ స్ట్రెచ్ రోడ్డును నిర్మించారు. మహారాష్ట్రలోని అమరావతి నుంచి అకోలా జిల్లాల మధ్య ఈ రహదారిని నిర్మించారు.

నేషనల్‌ హైవే అథారిటీ ఆఫ్‌ ఇండియా (NHAI) అతి తక్కువ సమయంలో ఈ 75 కిలోమీటర్ల పొడవైన రహదారిని నిర్మించి గిన్నిస్ వరల్డ్ రికార్డు కు ఎక్కింది. ఈ జాతీయ రహదారి నిర్మాణం ఐదు రోజుల్లోనే పూర్తయింది. ఖతార్‌ పేరిట ఉన్న రికార్డును భారత్ బద్దలు కొట్టింది. ఈ రికార్డుకు సంబంధించిన వివరాలను కేంద్ర రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ ట్విట్టర్లో పేర్కొన్నారు. గిన్నిస్‌ రికార్డ్‌ సర్టిఫికెట్‌తో పాటు రోడ్డు నిర్మాణ ఫొటోలను ఆయన షేర్‌ చేశారు.
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అమరావతి – అకోలా మధ్య 75 కిలోమీటర్ల (కిమీ) పొడవైన రహదారిని నిర్మించింది. అతి తక్కువ సమయంలో 105 గంటల 33 నిమిషాలలో రహదారిని పూర్తి చేసి గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను కైవసం చేసుకుంది. ఎన్‌హెచ్‌ఏఐకి చెందిన 800 మంది ఉద్యోగులు, ఇండిపెండెంట్ కన్సల్టెంట్‌లతో సహా ప్రైవేట్ కంపెనీకి చెందిన 720 మంది కార్మికులు ఈ పనులను రికార్డు సమయంలో పూర్తి చేశారు. జూన్ 3వ తేదీ ఉదయం ఏడు గంటల ప్రాంతంలో రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం కాగా జూన్ 7 సాయంత్రం 5 గంటలకు పూర్తి చేశారు. నితిన్ గడ్కరీ ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలిపారు. ఇందులో భాగమైన ఇంజనీర్లు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.


Tags:    

Similar News