ఊహించని విషాదం: అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తుండగా.. భారీ వరద

సెర్చింగ్, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, పోలీసు బృందాలు ప్రజలను రక్షించే పనిలో ఉన్నాయని చెప్పారు.

Update: 2022-10-06 02:08 GMT

పశ్చిమ బెంగాల్‌లోని జల్‌పైగురిలో విజయదశమి సందర్భంగా అమ్మవారి విగ్రహ నిమజ్జనం పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపింది. ఆకస్మిక వరదల కారణంగా మాల్ నదిలో ఎనిమిది మంది కొట్టుకుపోయారు. ఒక్కసారిగా వచ్చిన వరదకు పలువురు అదృశ్యమయ్యారని సీనియర్ అధికారి తెలిపారు. మృతుల్లో నలుగురు మహిళలు ఉన్నారు. బుధవారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో నిమజ్జనోత్సవంలో పాల్గొనేందుకు వందలాది మంది మాల్ నది ఒడ్డున గుమిగూడిన సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. "అకస్మాత్తుగా, ఆకస్మిక వరదలు సంభవించాయి. ప్రజలు కొట్టుకుపోయారు. ఇప్పటివరకు ఎనిమిది మృతదేహాలను వెలికితీశారు. ఇప్పటికి సుమారు 50 మందిని రక్షించాము" అని జల్పైగురి జిల్లా మేజిస్ట్రేట్ మౌమితా గోదారా PTI కి చెప్పారు. స్వల్ప గాయాలైన 13 మందిని సమీపంలోని ఆసుపత్రికి తరలించినట్లు ఆమె తెలిపారు. సెర్చింగ్, రెస్క్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. NDRF, SDRF, పోలీసు బృందాలు ప్రజలను రక్షించే పనిలో ఉన్నాయని ఆమె చెప్పారు.

మల్ అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న రాష్ట్ర వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి బులు చిక్ బరైక్ మరణాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని భయాన్ని వ్యక్తం చేశారు. "ఘటన జరిగినప్పుడు నేను సంఘటనా స్థలంలో ఉన్నాను. చాలా మంది ప్రజలు కొట్టుకుపోయారు. నీటి ప్రవాహం చాలా బలంగా ఉంది. సంఘటన జరిగినప్పుడు వందలాది మంది ప్రజలు ఉన్నారు. ఇంకా చాలా మంది తప్పిపోయారు," అని ఆయన అన్నారు. బరాక్, సీనియర్ తృణమూల్ నాయకులు సహాయక చర్యలను పర్యవేక్షించడానికి సంఘటనా స్థలానికి చేరుకున్నారు.
మాల్ నదిలో అమ్మవారి విగ్రహాన్ని నిమజ్జనం చేస్తున్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది. నదీ ప్రవాహం ఒక్కసారిగా పెరగడంతో నిజమ్జనానికి వచ్చిన వారిలో చాలామంది కొట్టుకుపోయారు. వీరిలో 8 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 50 మందిని పోలీసులు రక్షించారు. గల్లంతైన వారి కోసం ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక్కసారిగా వరదలు సంభవించినట్టు తెలిపారు.



Tags:    

Similar News