Delhi Air Pollution : ఢిల్లీలో పెరిగిన వాయు కాలుష్యం.. ఇక వీటిపై ఆంక్షలు

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. దీంతో పలువురు అనారోగ్యం పాలవుతున్నారు.

Update: 2024-10-18 12:11 GMT

ఢిల్లీలో వాయు కాలుష్యం పెరిగింది. దీంతో పలువురు అనారోగ్యం పాలవుతున్నారు. వాయు కాలుష్యం రెండు వందల నుంచి మూడు వందల వరకూ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పెరిగింది. ప్రభుత్వం అత్యవసర సమావేశమై యుద్ధప్రాతిపదికపైన చర్యలు తీసుకోవాలని ప్రారంభించింది. ఢిల్లీలో వృద్ధులు, చిన్నారులు వాయుకాలుష్యం పెరగడంతో అస్వస్థతకు గురి అవుతున్నారు. దీంతో పాటు న్యాయస్థానాలు కూడా వాయు కాలుష్యంపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.

సిగ్నల్స్ వద్ద...
దీంతో ప్రభుత్వం అత్యున్నత స్థాయి సమావేశం నిర్వహించి తగిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. ఇకపై పాత వాహనాలపై రాకపోకలను నిషేధించారు. అంటే పాత కాలం నాటి వాహనాలు ఇకపై రోడ్లమీదకు రావడానికి వీలు లేదు. అలాగే వాహనాలు సిగ్నల్స్ వద్ద వాహనాల ఇంజిన్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. హోటల్స్, రెస్టారెంట్లలో కలప వినియోగంపై ఆంక్షలను విధించింది. దీపావళి పండగ కోసం టపాసుల పేల్చడంపై నిషేధం విధించింది. నిర్మాణాలు, పాత భవనాల కూల్చివేత సమయంలో దుమ్ము థూళి కట్టడికి చర్యలు తీసుకోవాలని కోరింది.


Tags:    

Similar News