విమానానికి బాంబు బెదిరింపు..ఘర్షణే కారణం

విమానం టేకాఫ్ అవుతుండగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది.;

Update: 2025-01-26 06:20 GMT
plane, taking off,  bomb threats, chennai
  • whatsapp icon

విమానం టేకాఫ్ అవుతుండగా బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపింది. ఈ ఘటన కొచ్చి నుంచి చెన్నై వస్తున్న ఒక విమానంలో జరిగింది. విమానంలో ప్రయాణికుల మధ్య జరిగిన ఘర్షణ బాంబు బెదిరింపులకు దారితీసిందని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. కొచ్చి నుంచి చెన్నై వస్తున్న ప్రైవేటు ప్యాసింజర్ విమానంలో టేకాఫ్ అవుతుండగా..ఓ విదేశీ ప్రయాణికుడితో పాటు ఇద్దరు వ్యక్తులు మధ్య ఘర్షణ పడ్డారు.

ఇద్దరి మధ్య ఘర్షణతో...
దీంతో అందులో ప్రయాణికుడు బాంబు పెడతామని బెదిరించడంతో అందరూ భయపడిపోయారు. ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేసి దాదాపు మూడు గంటల పాటు భద్రతా సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. బాంబులు లేకపోవడంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే బాంబు బెదిరించిన ప్రయాణికుడిపై కేసు నమోదు చేసిన ఎయిర్ పోర్టు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


Tags:    

Similar News