Mumbai : మూడు రోజులపాటు రైళ్లన్నీ బంద్
ముంబయి వాసులకు బ్యాడ్ న్యూస్. ముంబయి వాసులకు మూడు రోజుల పాటు లోకల్ రైళ్లు అందుబాటులో ఉండవు
ముంబయి వాసులకు బ్యాడ్ న్యూస్. ముంబయి వాసులకు మూడు రోజుల పాటు లోకల్ రైళ్లు అందుబాటులో ఉండవు. ముంబయి లో జరుగుతున్న పనుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ముంబైలో 63 గంటల పాటు రైళ్లకు బ్రేక్ పడనుంది. ముంబై నెట్‌వర్క్‌లో ప్లాట్‌ఫాం విస్తరణ పనుల కోసం సెంట్రల్ రైల్వే ఈ రాత్రి నుంచి 63 గంటల మెగా బ్లాక్‌ను నిర్వహించనుంది.
ప్లాట్ ఫాం విస్తరణ...
ప్లాట్ ఫాం విస్తరణ కారణంగా మరిన్ని రైళ్లను ముంబయి వాసులకు అందుబాటులోకి రానున్నాయని రైల్వే శాఖ తెలిపింది. నిత్యం ముంబయిలో లోకల్ రైళ్లలో లక్షల మంది ప్రయాణిస్తుంటారు. ప్రయాణికుల సౌకర్యం కోసమే విస్తరణ చేపడుతున్నామని, ప్రయాణికులు సహకరించి అర్థం చేసుకోవాలని కోరారు. ఈ మూడు రోజుల పాటు ప్రత్యామ్నాయ మార్గాలను వెతుక్కోవాలని సూచించింది.