ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శన
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు బెంగళూరు ముస్తాబయింది. వైమానిక విన్యాసాలకు సర్వం సిద్ధమయింది
ఆసియాలోనే అతిపెద్ద వైమానిక ప్రదర్శనకు బెంగళూరు ముస్తాబయింది. వైమానిక విన్యాసాలకు సర్వం సిద్ధమయింది. తొలిసారి ఐదు రోజుల పాటు బెంగళూరులోని యలహంక వైమానిక కేంద్రంలో ఈ ఎయిర్ షోను నిర్వహిస్తున్నారు. ది రన్ వే టూ బిలియన్ ఆపర్చ్యునిటీస్ థీమ్ తో వైమానిక ప్రదర్శనను నిర్వహిస్తున్నారు. దాదాపు ముప్ఫయి ఐదు వేల చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఇందుకోసం వేదికను నిర్మించడం విశేషం.
నాలుగోసారి...
నాలుగో సారి కర్ణాటక ప్రభుత్వం ఎయిర్ షోకు ఆతిథ్యం వహిస్తున్నారు. ఈ ఎయిర్ షోలో మొత్తం 98 దేశాలు పాల్గొంటున్నాయి. ఈ సందర్భంగా 809 మంది రక్షణ, వైమానిక రంగ ప్రదర్శకారులు పాల్గొంటారు. 32 దేశాల రక్షణ మంత్రులు కూడా పాల్గొంటున్నారు. ఈ వైమానిక ప్రదర్శనను భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా పెద్దయెత్తున పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నాలు జరుపుతున్నారు.