BJP : నేడు బీజేపీ సమావేశాలు.. ఎన్నికల సమయంలో?
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ క్యాడర్ ను, లీడర్లను సిద్ధం చేస్తుంది;
bharatiya janata party legislative assembly party leader election will be held today
లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో భారతీయ జనతా పార్టీ క్యాడర్ ను, లీడర్లను సిద్ధం చేస్తుంది. హ్యాట్రిక్ విజయాన్ని సాధించాలన్న లక్ష్యంతో కసితో కమలం పార్టీ ఈ ఎన్నికల్లోకి దిగుతుంది. 2014, 2019 ఎన్నికలకంటే అత్యధిక స్థానాలను సాధించే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు నేడు పార్టీ ీఅగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు.
400 స్థానాలను...
ఈసారి 400 లోక్‌సభ స్థానాలను సాధించాలన్న పట్టుదలతో భారతీయ జనతా పార్టీ ఉంది. ఒంటరిగానే ఈ అంకెను చేరుకోవాలన్న లక్ష్యంతో ఉంది.నేటి నుంచి మూడు రోజుల పాటు బీజేపీ కార్యవర్గ సమావేశాలు జరగనున్నాయి. ఇవాళ అన్ని రాష్ట్రాల పదాధికారులతో సమావేశం జరగనుంది. రానున్న ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై బీజేపీ అగ్రనేతలు దిశానిర్దేశం చేయనున్నారు.